వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వాసం: కేజ్రీవాల్‌కు బిజెపి ప్రశ్నల వర్షం, కాంగ్రెస్ విప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

harshavardhan, arvind kejriwal,
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) దేశానికే ప్రమాదకరమని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాసన సభా పక్ష నేత హర్షవర్ధన్ గురువారం అన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ప్రారంభమైంది. మంత్రి మనీష్ సిసోడియా విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఎఎపి ఇచ్చిన వాగ్ధానాలకు కట్టుబడి ఉందని సిసోడియా చెప్పారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ ఎఎపిపై మండిపడ్డారు.

ఎఎపి ఢిల్లీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీతో చేయి కలపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రజాకర్షక పథకాలు అమలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ అవినీతి రూపు మాపడంలో చూపించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు మెట్రో రైలులో, బస్సుల్లో ప్రయాణించడం గొప్ప విషయం కాదని, అలా చౌకబారు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కాశ్మీర్ పైన చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలన్నారు. తాము కూడా నీతివంతమైన రాజకీయాల కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎఎపి ఫండ్స్ పైనా హర్షవర్ధన్ ప్రశ్నల వర్షం గుప్పించారు. అవినీతికి వ్యతిరేకమంటున్న ఎఎపి అవినీతిమయమైన కాంగ్రెసు పార్టీ మద్దతును ఎలా తీసుకుందని ప్రశ్నించారు.

సభలో గందరగోళం

ఢిల్లీ శాసన సభలో మొదట గందరగోళం ఏర్పడింది. ఎఎపి ఎమ్మెల్యేలు టోపీలు ధరించి సభకు రావడంపై బిజెపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోనే వారు ఆందోళన చేపట్టారు. బిజెపి ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. విశ్వాస తీర్మానాన్ని బిజెపి వ్యతిరేకించింది.

కాంగ్రెసు పార్టీ విప్

కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెసు పార్టీ తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.

English summary

 As Arvind Kejriwal prepares to seek the trust vote today in Delhi Assembly, BJP seemed to be in an aggressive mood, questioning AAP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X