గర్ల్‌పై రెండ్రోజులు గ్యాంగ్ రేప్: మరణశిక్ష విధించిన కోర్టు

 Haryana gang rape murder: Court gives death sentence to convicts
న్యూఢిల్లీ: పందొమ్మిదేళ్ల యువతిపై రెండు రోజుల పాటు అత్యాచారం చేసిన ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ ద్వారకా ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. హర్యానాకు చెందిన యువతి పైన ముగ్గురు యువకులు 2012 ఫిబ్రవరిలో అత్యాచారం జరిపారు. విచారణ జరిపిన కోర్టు ముగ్గురిని దోషులుగా నిర్ధారించి, శిక్ష విధించింది.

2012లో అత్యాచారానికి గురైన యువతి మృతదేహం కొద్ది రోజుల తర్వాత రేవారి ప్రాంతంలో గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరిపారు. యువతి ఇంటికి వెళ్తుండగా దోషులు ముగ్గురు ఎత్తుకెళ్లినట్లు, అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

నిందితులకు మరణ శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు అప్పటి నుండి డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా నిందితులకు ఉరిశిక్షనే వేయాలని కోరారు. కేసు నడుస్తున్న సమయంలో నిందితులు ముగ్గురు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.

2012 ఫిబ్రవరి 9, 10 తేదీలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దోషుల పైన అప్పుడు కిడ్నాప్, అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+