వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ సమీపంలోని 14 జిల్లాలలో బాణాసంచా బ్యాన్ చేసిన హర్యానా ; కొన్ని జిల్లాల్లో గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి !!

|
Google Oneindia TeluguNews

రానున్న దీపావళి నేపథ్యంలో బాణాసంచాపై నిషేధం విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో దీపావళికి కొన్ని రోజుల ముందు హర్యానా రాష్ట్రంలోని ఢిల్లీ సమీపంలోని 14 జిల్లాల్లో బాణాసంచా అమ్మకాలు మరియు వాడకాన్ని నిషేధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు కూడా బాణాసంచా అమ్మకాలను జరపరాదని వెల్లడించింది.

టపాసుల అమ్మకం మరియు పేల్చడం 14 జిల్లాలలో నిషేధం
టపాసులు పేల్చడం వల్ల హాని జరుగుతుందని, శ్వాసకోశ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అలాగే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ చర్యకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉదహరించింది. టపాసుల అమ్మకం మరియు పేల్చడం 14 జిల్లాలలో నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. భివానీ, చర్కీ దాద్రీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఝజ్జర్, జింద్, కర్నాల్, మహేంద్రగఢ్, నుహ్, పల్వాల్, పానిపట్, రేవారి, రోహ్తక్ మరియు సోనిపట్ లలో బాణాసంచా కాల్చడం పై, బాణాసంచ విక్రయాలపై నిషేధం విధించింది హర్యానా ప్రభుత్వం.

Haryana has banned crackers in 14 districts near Delhi; Green crackers allowed in some districts !!

గాలి నాణ్యత మధ్యస్తంగా ఉంటే గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి
టపాసుల వినియోగం వల్ల కలిగే వాతావరణ కాలుష్యంతో గాలి నాణ్యత తగ్గిపోతుందని, నవంబర్‌లో పరిసర గాలి నాణ్యత (గత సంవత్సరం డేటా ప్రకారం) అతి తక్కువగా ఉన్న నగరాలు మరియు పట్టణాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. అయితే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్లు అనుమతించబడతాయని వెల్లడించింది. వివాహాలు మరియు ఇతర సందర్భాలలో కూడా, గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అనుమతించబడతాయి అని ప్రభుత్వం తెలిపింది.

బాణా సంచా పేల్చే సమయాలు, స్థలాలపైన కూడా ఆదేశాలు
గాలి నాణ్యత మధ్యస్థంగా ఉన్న నగరాలు, పట్టణాలు, ఇతర ప్రాంతాలలో దీపావళి రోజులలో లేదా గురుపురబ్ వంటి ఏదైనా ఇతర పండుగలలో క్రాకర్లను పేల్చే సమయాలు ఖచ్చితంగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే ఉంటాయి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, బాణసంచా వినియోగం రాత్రి 11:55 నుండి 12:30 వరకు మాత్రమే ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. బాణాసంచా వినియోగానికి అనుమతించబడిన ప్రాంతాలలో, ప్రభావాన్ని తగ్గించడానికి సమూహాలుగా క్రాకర్లు పేల్చడానికి ప్రజలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు క్రాకర్లు పేల్చగల ప్రాంతాలను అధికారులు గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తారని పేర్కొంది.

ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం .. అందుకే ఢిల్లీలోనూ నో క్రాకర్స్
గత నెలలో, ప్రమాదకర వాయు కాలుష్య స్థాయిలపై ఆందోళనల కారణంగా పొరుగున ఉన్న ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో బాణసంచా నిల్వ, అమ్మకం మరియు వాడకాన్ని నిషేధించింది. గత నెలలోనే దేశ రాజధాని ఢిల్లీలో పూర్తిగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయించడం, కాల్చడం నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో అన్ని రకాల టపాసులను నిల్వ చేయడం, విక్రయించడం , పేల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గత మూడు సంవత్సరాలలో దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో విపరీతమైన కాలుష్యం పెరిగిపోవడంతో, ప్రస్తుత కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రస్తుతం హర్యానా కూడా 14 జిల్లాలలో బాణా సంచా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ ప్రారంభంతో వాయు కాలుష్య స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి రాష్ట్రాలు.

English summary
Haryana has banned crackers in 14 districts near Delhi and allowed green crackers in some districts. The decision was taken by the state of Haryana in the wake of rising air pollution and respiratory problems to people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X