వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్, ప్రియాంక లైవ్ పెట్రోల్ బాంబులు: హర్యానా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం పై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్ను ముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఎన్ ఆర్ సి అమలు చేసేది లేదని తేల్చి చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలలో హింసాకాండ కొనసాగుతోంది. దాదాపు 23 మంది పౌరసత్వ సవరణ చట్టం పై రగిలిన ఘర్షణల్లో మృత్యువాత పడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలతోపాటు ఉద్యమిస్తోంది. ఇటీవల ఘర్షణల్లో మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పరామర్శిస్తున్నారు.ఇక దీనిపై హర్యానాలోని మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ , ప్రియాంకాలపై అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

రాహుల్ , ప్రియాంకాలపై అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

హర్యానా మంత్రి అనిల్ విజ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు ఇద్దరూ లైవ్ పెట్రోల్ బాంబులు అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగుతున్న పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల పక్షాన నిలబడి బిజెపి సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఇక ఇదే సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇద్దరూ ‘లైవ్ పెట్రోలు బాంబులు'అంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సీఏఏ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళిన రాహుల్, ప్రియంకాలు

సీఏఏ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళిన రాహుల్, ప్రియంకాలు

వారెక్కడికి వెళ్లినా మంటలు పెట్టి ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తుంటారంటూ వ్యాఖ్యానించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హర్యానా మంత్రి అనిల్ విజ్.పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో మరణించిన ఇద్దరు బాధితులకుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్లిన ప్రియాంక, రాహుల్‌లను అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. తమను మీరట్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, ఇందుకు సంబంధించి రాతపూర్వకంగా తమకు ఎటువంటి ఉత్తర్వులు పోలీసులు చూపించలేదని రాహుల్ మండిపడ్డారు.

పోలీసుల తీరుపై రాహుల్ అసహనం .. రాహుల్, ప్రియాంకాలపై మంత్రి అనిల్ విజ్ తీవ్ర వ్యాఖ్యలు

పోలీసుల తీరుపై రాహుల్ అసహనం .. రాహుల్, ప్రియాంకాలపై మంత్రి అనిల్ విజ్ తీవ్ర వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇంతగా పోరాటం చేస్తున్న ఇంతమంది మృతి చెందుతున్న బిజెపి సర్కార్ పట్టించుకోకపోవడం దారుణమని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వాదన మరోలా ఉంది. మీరట్‌లో 144 సెక్షన్ అమల్లో ఉందని, నిషేధ ఉత్తర్వుల కాపీని చూపించడంతో వారు వెనుదిరిగారని మీరట్ ఎస్పీఅజయ్ సాహ్నీ తెలిపారు.రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఈ ఘటన అనంతరం అనిల్ విజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ లైవ్ పెట్రోలు బాంబులాంటి వారిని వారిద్దరూ ఎక్కడికి వెళ్తే అక్కడ మంటలు తథ్యమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అనిల్ విజ్ వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు

English summary
Dubbing Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi Vadra as "live petrol bombs", Haryana Home Minister Anil Vij on Tuesday said the people should be beware of them.“Beware of priyankagandhi and Rahul Gandhi as they are live Petrol Bombs. Where ever they go, they ignite fire and cause loss to Public Property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X