‘దెయ్యం వెంటాడుతోంది’: యువతి ఆత్మహత్య

తిరుచిరాపల్లి: తమిళనాడులోని ముసిరి జిల్లాలోని చిన్న పల్లిపాళ్యంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను దెయ్యం వేటాడుతోందదని భయాందోళనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. వినోదిని అనే 19 సంవత్సరాల యువతికి కొన్ని నెలల నుంచి మానసిక సమస్యతో బాధపడుతోంది. వినోదిని కుటుంబం నివాసముండే ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

'Haunted' by ghost, teenage girl ends life

ఆ మహిళ మరణంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన వినోదిని మానసికంగా కుంగిపోయింది. చనిపోయిన మహిళ ఆత్మ తన శరీరంలో ప్రవేశిస్తున్నట్టుగా తనకు తాను భావించింది. ఆత్మ తనను తరుముతున్నట్టుగా నమ్మి, తప్పించుకోవడానికి ప్రయత్నించేది.

ఆమె ప్రవర్తనను చూసిన తల్లిదండ్రులు మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆత్మ తనను తరుముతుందని, చంపడానికొస్తుందని చెప్పింది. ఈ మానసిక వేదనతో నరకయాతన అనుభవించిన వినోదిని ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది.

దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దెయ్యం వెంటపడుతుందనే భయాందోళనతోనే ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+