విధుల్లో చేరితేనే డిమాండ్ల పరిష్కారం .. దీదీ మరోసారి అల్టిమేటం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన పీక్ స్టేజీకి చేరడంతో ఆ రాష్ట్ర సీఎ మమతా బెనర్జీ దిగొచ్చారు. వైద్యుల డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. వైద్యులు చెప్తున్న డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఇకనైనా ఆందోళన విరమించాలని ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లను కోరారు దీదీ

బాధ్యత మాది ..
జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్లన్నీ పరిష్కారిస్తామని సీఎం మమత స్పష్టంచేశారు. అయితే వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. విధుల్లో చేరితే జూనియర్ డాక్టర్లు కోరుతున్న దానికంటే ఎక్కువ తీరుస్తామని తేల్చిచెప్పారు. గత ఐదురోజులుగా డాక్టర్లు ఆందోళన చేస్తున్న వారి పట్ల తాము మెతకవైఖరి అవలంభిస్తున్నామని పేర్కొన్నారు. రోగులకు సేవలు అందించకున్నా .. ఎస్మా లాంటి చట్టాన్ని ప్రయోగించలేదని గుర్తుచేశారు.

రోగుల కోసం ..
రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే విధుల్లో చేరాలని కోరారు. వారు విధుల్లో చేరితే తాము వారు కోరిన కోరికలు తీరుస్తామని పేర్కొన్నారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే తాము మెతకవైఖరి అవలంభిస్తున్నామని మరోసారి ఉద్ఘాటించారు. ఎస్మా లాంటి చట్టాలే కాదు .. వైద్యులను అదుపులోకి తీసుకోలేదని గుర్తుచేశారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.

నిరసనకు కారణమిదీ ..
గత సోమవారం ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో రోగి బంధువులు బీభత్సం సృష్టించి నంగతి తెలిసిందే. తమ బంధువు చనిపోవడానికి జూనియర్ డాక్టర్లు పరిబర ముఖపాధ్యాయ్, యాష్ కారణమని దాడిచేశారు. దాదాపు 200 మంది ఆస్పత్రిలో నానా హంగామా చేశారు. ముఖపాధ్యాయ తలపై వెనక నుంచి ఇటుకపెళ్లతో దాడిచేయడంతో పుర్రె ఎముక విరిగింది. దీంతో తొలుత ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత పార్క్ సైన్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులపై దాడిని నిరసిస్తూ ఎన్ఆర్ఎస్ డాక్టర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications