చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటే చర్యలు, గోరక్షకులపై మోడీ ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గోరక్షణ పేరిట దాడులకు తెగబడుతున్న మూకలకు ప్రధానమంత్రి మోడీ మరోసారి గట్టిగా హెచ్చరికలు జారీచేశారు. చట్టాన్ని ఎవరూ కూడ చేతుల్లోకి తీసుకోకూడదని ఆయన తేల్చిచెప్పారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమౌతున్న నేపథ్యంలో మోడీ ఈ విషయమై స్పందించారు. ఏ వ్యక్తి కానీ, గ్రూప్‌కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదన్నారు.

 Have asked states to take strict action against cow vigilantes: PM Modi

ప్రధాని మోడీని ఉటంకిస్తూ కేంద్రమంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత ప్రదానమంత్రి బిజెపి సీనియర్‌నేతల సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

గోరక్షణ పేరిట దాడులు కొట్టిచంపడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ మేరకు తీవ్రంగా స్పందించారు. గోరక్షణ పేరుతో హింసాత్మక దాడులకు తెగబడుతున్న వారిపై ప్రధాని మోడీ గతంలోనూ మండిపడ్డారు. ఆవులపై భక్తి పేరిట ప్రజలను చంపడం ఎంతమాత్రం ఆమోదం కాదన్నారు.

అహింసకు నెలవైన నేల మనది. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనే అధికారం ఈ దేశంలో ఎవరికీ లేదు అంటూ గుజరాత్ పర్యటన సందర్భంగా మోడీ ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi has issued a stern warning to cow vigilante groups on the eve of the monsoon session of Parliament, saying no one can take law and order into their own hands.
Please Wait while comments are loading...