నిత్యానంద స్వామికి ఊరట, కానీ పురుషత్వ పరీక్షకు..

అయితే, నిత్యానంద స్వామి ఆగస్టు ఆరవ తేదీన పురుషత్వ పరీక్షలకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులు అందరు కూడా రామనగర కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
సినీ నటి రంజితతో నిత్యానందకు శారీరక సంబంధాలున్నాయన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిత్యానంద మాజీ శిష్యురాలు ఒకరు నిత్యానంద తనను శారీరకంగా వేధించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో నిత్యానందను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు నిత్యానంద దొరకలేదు.
దీంతో, నిత్యానంద కేసు కోర్టుకు చేరింది. కేసును విచారించిన రామనగర సెషన్స్ కోర్టు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి నిత్యానంద పైకోర్టుకు అప్పీల్ చేశాడు. తాను బాలుడితో సమానమని, తనకు సెక్స్ సామర్థ్యం లేదంటూ కోర్టుకు తెలిపాడు. దీంతో, నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
కాగా, వివాదాస్పద నిత్యానంద స్వామికి కోయంబత్తూరులోని కోవై కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ మూడవ తేదీన తమ ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. 2011 చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా చర్యలు తీసుకుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications