• search

వాళ్లు నాకు ఓటేస్తారనుకున్న, వారితో మాట్లాడా, అధికారం మాత్రమే కోల్పోయా: యెడ్యూరప్ప

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగళూరు: అసెంబ్లీలో శనివారం యడ్యూరప్ప ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలతో మాట్లాడింది వాస్తవమేనని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు తమ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తనకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడతారని ఆశించానని యెడ్డీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారన్నారు.

  చదవండి: కర్ణాటక ఎప్పుడూ ఇంతే: యడ్యూరప్పను రెండుసార్లు దెబ్బతీసిన కుమారస్వామి

  కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయాయని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా బీజేపీని కన్నడ ప్రజలు 104 స్థానాల్లో గెలిపించారన్నారు. తమకు 104 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తెరచాటు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ప్రజలు నాపై చూపిన ప్రేమ, అభిమానాలు మరువలేనన్నారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయన్నారు. తాను ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశానని చెప్పారు.

  చదవండి: ఇక చాలు, రాజీనామా చేయండి!: యడ్యూరప్ప తీరుపై అధిష్టానం ఆగ్రహం? రంగంలోకి బీజేపీ పెద్దలు

  వాళ్లు నాకు ఓటేస్తారనుకున్నా

  వాళ్లు నాకు ఓటేస్తారనుకున్నా

  విపక్షసభ్యుల్లో కొందరితో నేను మాట్లాడటం నిజమేనని యడ్యూరప్ప చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి కాంగ్రెస్ - జేడీఎస్ సభ్యులు ఓటేస్తారనుకున్నానని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై బీజేపీకి విశ్వాసం ఉందని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉందని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని అవతలి పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు భావిస్తారని ఆశించానని, సహకరించడానికి కొందరు ఒప్పుకున్నారని, అయినా రాజకీయాల్లో ప్రశ్నించడానికి నేనెవరినని, ఆకాంక్షలు వేరు, అనేక వైరుద్ధ్యాలు ఉంటాయని యెడ్డీ అన్నారు.

  ఎన్నికల సమయంలో తిట్టుకొని, ఇప్పుడు కలిశారు

  ఎన్నికల సమయంలో తిట్టుకొని, ఇప్పుడు కలిశారు

  ఎమ్మెల్యేలను మీరు నిర్బంధించారని, మీ నేతల మీద మీకే నమ్మకం లేదని, ఆ ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉందని, కనీసం తమ కుటుంబ సభ్యులతోనూ ఫోన్లో మాట్లాడలేని దుస్థితి అని, నేడు ఆ ఎమ్మెల్యేలను చూశాక వారి కుటుంబ సభ్యులు కొంచెం ఊరట చెంది ఉంటారని, కాంగ్రెస్‌కు కానీ జేడీఎస్‌కు కానీ ప్రజల మద్దతు లేదని యెడ్డీ అన్నారు. ఎన్నికల్లో పరస్పరం ఆరోపణలు రువ్వుకున్న ఈ పార్టీలు ఓటమిపాలయ్యాక అవకాశవాద రాజకీయాలకు దిగాయని, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఒక అవగాహనకు వచ్చాయన్నారు.

  నాకు ఇదే మొదటిసారి కాదు

  నాకు ఇదే మొదటిసారి కాదు

  ఈ రోజు దీనిని అగ్నిపరీక్షగా భావిస్తున్నానని, ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం నాకు ఇదే మొదటిసారి కాదని, జీవితమంతా తనకు అగ్నిపరీక్షేనని, రాష్ట్ర ప్రజలు ఒక సెకనుపాటు ఆలోచించి మాకు 113 సీట్లను అందించి ఉంటే ఈ రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయి ఉండేదని, కానీ దైవనిర్ణయం మరోలా ఉందని యెడ్డీ అన్నారు. తాను పోరాట యోధుడిని అని, రాష్ట్రమంతా పర్యటించి జరిగిన పరిణామాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే లోకసభ ఎన్నికల్లో 28 సీట్లను గెలిచి మెడీకి కానుకగా ఇస్తానని చెప్పారు.

  అధికారం లేకుంటే మరణిస్తానన్నారు

  అధికారం లేకుంటే మరణిస్తానన్నారు

  అధికారం లేకుంటే నేను మరణిస్తానని ఎవరో (కుమారస్వామిని ఉద్దేశించి) అన్నారని, నేను అలా మాట్లాడనని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు నా జీవితం అంకితమని యెడ్డీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను విశ్వాస పరీక్షకు పట్టుబట్టడం లేదని, రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటన చేశారు. ఇలాంటి రాజకీయాలపై నేను ప్రజల్లోకి వెళ్లి అడుగుతానని చెప్పారు.
  చివరి ఊపిరి ఉన్నంత వరకు రైతుల కోసం పని చేస్తానని చెప్పారు. మా హయాంలో నీటి పారుదల కోసం లక్షన్నర కోట్లు కేటాయించామని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను ప్రజలు తిరస్కరించారన్నారు. తాను రెండేళ్లుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించానని చెప్పారు. గత ప్రభుత్వాల పాలన కారణంగా ప్రజల కళ్లల్లో బాధను చూశానన్నారు.

  నేను అధికారం మాత్రమే కోల్పోయా

  నేను అధికారం మాత్రమే కోల్పోయా

  గడిచిన అయిదేళ్లలో తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని యెడ్డీ చెప్పారు. తాను రాజీనామా చేస్తున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు. ప్రజలు సుస్థిర పాలన కోరుకుంటున్నారని చెప్పారు. మేం అధికారంలోకి వస్తే వృద్ధాప్య, వితంతు పించన్లు పెంచాలనుకున్నామని, లక్ష రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆశించామన్నారు. కర్ణాటకపై ప్రధాని ఎప్పుడూ వివక్ష చూపలేదన్నారు. కర్ణాటకకు ఇప్పుడు నిబద్ధత కలిగిన నేతలు కావాలన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల కలయిక అపవిత్రమన్నారు. నేను ఇప్పుడు అధికారం మాత్రమే కోల్పోయానని, ఏమీ కోల్పోలేదని యడ్యూరప్ప చెప్పారు. 2019 లోకసభ ఎన్నికల్లో మేం 28 పార్లమెంటు స్థానాలకు 28 గెలుస్తామని చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The less than three-day-old BJP government, led by B.S. Yeddyurappa, made way for a Congress-Janata Dal (S) alliance dispensation in Karnataka on Saturday in a tame end to a week-long political drama.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more