వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ విషయాలు చెప్పిన భారత ఐఎస్‌ ఉగ్రవాది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ఉత్సాహంగా వెళ్లి.. అక్కడి పరిస్థితులను చూసి భయాందోళనకు గురై.. తిరిగి మాతృదేశ బాటపట్టిన ఓ ఉగ్రవాది చెప్పిన విషయాలు మనల్నీ దిగ్ర్భాంతికి గురి చేసేలా ఉన్నాయి. అతడే మహారాష్ట్ర పన్వేల్‌కు చెందిన అరిబ్‌ ఫయ్యాజ్‌ మజీద్‌ (23).

అతడు చెప్పిన విషయాలను ఓ మీడియా ఛానల్‌ ప్రసారం చేసింది. ఆ వివరాల ప్రకారం.. మహారాష్ట్ర పన్వేల్‌కు చెందిన అరిబ్‌ ఫయ్యాజ్‌ మజీద్‌ ఇంజినీరింగ్‌ విద్య పూర్తిచేశాడు. 2014 మేలో నలుగురు స్నేహితులతో కలిసి ముంబై.. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఐఎస్‌ఐఎస్‌ శిక్షణ పాఠశాలలో ఆత్మాహుతి దళసభ్యుడి(ఫిదాయీ)గా శిక్షణ పూర్తిచేసుకున్నాడు.

ఆగస్టులో మోసుల్‌ నగరంలో సైనిక దళాలపైకి పేలుడు పదార్థాల వాహనంతో ఆత్మాహుతి దాడికి దిగాల్సి ఉండగా.. వైమానిక దాడుల్లో ఆ వాహనం నాశనమైంది. తర్వాత సెప్టెంబర్‌లో రేబియాలో కుర్దిష్‌ సైనిక శిబిరంపై అదే తరహా దాడి కోసం వాహనంతో దూసుకెళ్తుండగా కుర్ద్‌ సైనికులు వాహనంపైకి కాల్పులు జరిపి నిలువరించారు.

He Graduated As The First Indian Suicide Bomber From ISIS Training School

అరిబ్‌ గాయపడగా, ఐఎస్‌ఐఎస్‌ ఫైటర్లు కాపాడారు. మూడోసారి ఇరాక్‌ టలాల్‌హువాలో పేలుడు పదార్థాలు నింపిన కారుతో వెళ్తుండగా వైమానిక దాడి జరిగి మరోసారి విఫలమైంది. 3సార్లు ఆత్మాహుతి దాడులకు యత్నించినా విఫలమైనట్లు విచారణాధికారులకు తెలిపారు. కాగా, తన సివిల్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో భూమి లోపల బంకర్లు నిర్మించి పెట్టినట్లు వివరించాడు.

యువతను ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటుందని తెలిపాడు. అందమైన సిరియా యువతులను పెళ్లి చేసుకోవచ్చని కూడా ఆశ చూపుతుందని చెప్పాడు.

కానీ, తమకు బందీలుగా చిక్కిన యువతుల పట్ల ఉగ్రవాద సంస్థ దారుణంగా ప్రవర్తిస్తుందని చెప్పాడు. బందీలుగా పట్టుకున్న మహిళల్ని ఐఎస్‌ఐఎస్‌ లైంగిక బానిసలుగా ఉపయోగించుకుంటోందని అరిబ్‌ చెప్పాడు.

ఐఎస్‌ఐఎస్‌కు నియామకాలు చేసిపెట్టే ఓ మహిళ భారత్‌ నుంచి మరింతమందిని ఆకర్షించేందుకు తన ఫేస్‌బుక్‌ ఖాతాను ఉపయోగించుకునేందుకు చేసిన యత్నానికి సంబంధించిన ఉదంతాన్ని కూడా విచారణలో అరిబ్‌ వెల్లడించాడు.

కాగా, మహిళలపట్ల ఐఎస్‌ కృత్యాలు ఘోరంగా ఉన్నాయనీ, వాటిని ఇంటరాగేషన్‌ నివేదిక నుంచి తొలగించాలని నిర్ణయించామని అరిబ్‌ను ప్రశ్నించిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. గత నవంబర్‌లో భారత్‌ తిరిగొచ్చాక కస్టడీకి తీసుకున్న భద్రతా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. పలు నేరాల్లో విచారణ జరుగుతోంది.

English summary
In August last year, 23-year-old Arib Fayyaz Majeed, a civil engineer by training, set out for what was meant to be a suicide attack on Iraq and against the Kurdish Army positions in Mosul city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X