వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: ఉసిరి ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన వరం; బోలెడు రోగాలకు దివ్యౌషధం!!

|
Google Oneindia TeluguNews

ఉసిరి.. ప్రకృతి ప్రసాదించిన వరం. శీతాకాలంలో ఎక్కువగా దొరికే ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉసిరిని ఔషధ సిరి అని చెబుతారు. ఆయుర్వేద వైద్యంలో ఉసిరిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉసిరిని సంస్కృతం లో ఆమ్లా అని ధాత్రి ఫలమని పిలుస్తారు. ఉసిరికాయల వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.

health tips: హైబీపీ తగ్గాలంటే మీ ఆహారం ఇలా తీసుకోండి.. ఆపై రిజల్ట్ మీరే చూడండి!!health tips: హైబీపీ తగ్గాలంటే మీ ఆహారం ఇలా తీసుకోండి.. ఆపై రిజల్ట్ మీరే చూడండి!!

 ఉసిరి లో బోలెడు గొప్ప గుణాలు .. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఉసిరి లో బోలెడు గొప్ప గుణాలు .. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. ప్రతి రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో విటమిన్ సి పుష్కలంగా వచ్చి చేరుతుంది. ఉసిరి చెట్టు లో వేరు నుంచి చివరి చిగురు వరకు ప్రతి భాగమూ ఔషధంగా పనిచేస్తుంది. ఉసిరి లో ఉండే ఔషధ గుణాలు, చేకూర్చే ఆరోగ్యప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఉసిరి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. అంతేకాదు మన జీవక్రియను మెరుగుపరుస్తుంది.

ఉసిరి ఈ ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధం

ఉసిరి ఈ ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధం


వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచే ఉసిరి జలుబు, దగ్గును నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన అందాన్ని కూడా ఉసిరి మరింత ఇనుమడింపజేస్తుంది. ఉసిరి తో జుట్టు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కాలేయ వ్యాధులకు ఉసిరి దివ్యౌషధంగా పనిచేస్తుంది. డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజు ఉసిరిని తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడుతుందని, జ్ఞాపక శక్తి, తెలివితేటలూ పెరుగుతాయి అని చెబుతారు.

 ఉసిరితో డయాబెటిస్, ఒబేసిటీ కీ చెక్ పెట్టొచ్చు

ఉసిరితో డయాబెటిస్, ఒబేసిటీ కీ చెక్ పెట్టొచ్చు


ఇక ఉసిరి నెలసరి సమస్యలను తగ్గించడంలోనూ కీలకంగా ఉపయోగపడుతుంది. కళ్లకు సంబంధించిన అనేక సమస్యలను తగ్గించడంలోనూ ఉసిరి ఎంతగానో పనిచేస్తుంది. ఉసిరి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్య సమృద్ధికి తోడ్పడుతుంది. ఉసిరి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రీరాడికల్స్ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ఉసిరి గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంతోపాటు, కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుందని తెలుస్తుంది. ఉసిరిలో రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసి, డయాబెటిస్ ను కంట్రోల్ చేసే స్వభావం కూడా ఉంది.

ఈ సీజన్ లో రోజుకో ఉసిరికాయను తినండి

ఈ సీజన్ లో రోజుకో ఉసిరికాయను తినండి


ఉసిరితో మలబద్దకం తగ్గుతుందని చెబుతున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు సైతం తగ్గుతాయని తెలుస్తుంది. ఉసిరితో ఆస్తమాను కూడా తగ్గించవచ్చని, దగ్గు, కఫం వంటి సమస్యలను ఉసిరి నివారిస్తుందని చెబుతున్నారు. అందుకే ఉసిరిపొడిని చాలా ఆయుర్వేదిక్ షాపులలో విక్రయిస్తుంటారు. ప్రతిరోజు నిత్యం పరగడుపున ఒక స్పూను ఉసిరిపొడిని నీళ్లలో కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అని చెబుతారు. ఇక ఉసిరి దొరికే సీజన్ ఇదే కాబట్టి రోజుకు ఒక ఉసిరికాయను తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Amla is said to be a good remedy for many health problems. That's why don't forget to eat amla in this season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X