వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

helath tips: కిడ్నీలలో రాళ్ళతో బాధపడుతున్నారా? అయితే తినాల్సినవి.. తినకూడనివి ఇవే; తెలుసుకోండి!!

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. డబ్బులు ఎప్పుడైనా సంపాదించొచ్చు కానీ ఆరోగ్యం చెడిపోతే తిరిగి దానిని సంపాదించడం సాధ్యం కాదు. అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అనారోగ్యాలతో బాధపడే వారు అనారోగ్యానికి కారణం ఏమిటి? దానిని తగ్గించుకోవడం ఎలా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ? వంటి అనేక విషయాలను తెలుసుకోవాలి.

కిడ్నీలో రాళ్ల తో బాధపడేవారు తినకూడని ఆహారం ఇదే

కిడ్నీలో రాళ్ల తో బాధపడేవారు తినకూడని ఆహారం ఇదే

ప్రస్తుతం మనం కిడ్నీలో రాళ్ల తో బాధపడేవారికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న అంశాన్ని చెప్పుకుంటున్నాం. కిడ్నీలో రాళ్ల తో బాధపడేవారు ఖచ్చితంగా తీసుకోకూడని ఆహార పదార్థాల విషయానికి వస్తే వారు పాలకూర ఎట్టి పరిస్థితులలోనూ తినకూడదు.అంతేకాదు వారు గుమ్మడి కాయ, టమోటా, క్యాలీఫ్లవర్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.సపోటా, గోడంబి, పుట్టగొడుగులు వంటి వాటిని తినకూడదు.ఉసిరికాయ, దోస కాయ, వంకాయ, క్యాబేజీ లను తినకుండా జాగ్రత్త తీసుకోవాలి.

కిడ్నీలో రాళ్లు ఉంటే మటన్, చికెన్ ను బాగా తగ్గించాలి

కిడ్నీలో రాళ్లు ఉంటే మటన్, చికెన్ ను బాగా తగ్గించాలి

అంతేకాదు మటన్, చికెన్ లను కూడా తినడం బాగా తగ్గించాలి.ఈ ఆహార పదార్థాలను కిడ్నీలో రాళ్ల తో బాధపడేవారు తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది.మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొంతమందికిమూత్ర సంబంధిత వ్యాధులకు క్యాలీఫ్లవర్ బాగా పనిచేస్తుంది అని,అలాంటప్పుడు క్యాలీఫ్లవర్ ని ఎందుకు తినకూడదు అని సందేహం వస్తుంది.అందుకు కారణం ఉందని చెప్తున్నారు నిపుణులు. క్యాలీఫ్లవర్ లో ఉండే పురిన్స్ అందుకుకారణం అని చెప్తున్నారు.

కిడ్నీలో రాళ్ల తో బాధపడేవారు క్యాలీఫ్లవర్ ఎందుకు తినకూడదు అంటే

కిడ్నీలో రాళ్ల తో బాధపడేవారు క్యాలీఫ్లవర్ ఎందుకు తినకూడదు అంటే


క్యాలీఫ్లవర్ మూత్ర సంబంధిత వ్యాధులకు మంచిది,క్యాలీఫ్లవర్ లో ఇంకాసోడియం, పొటాషియం తక్కువ శాతంలోఉండడంవల్ల,శరీరంలోని నీటి శాతం అదుపులో ఉంటుంది. క్యాలీఫ్లవర్ లో ప్రోటీన్ తక్కువగా,పీచుపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలలోవ్యర్థాలు చేరుకోకుండా ఇవిసహాయపడతాయి.అయితే క్యాలీఫ్లవర్ లో పురిన్స్ అనేపదార్థాలుఎక్కువగా ఉండటం వల్ల అవి కిడ్నీలో రాళ్లుగాఏర్పడే అవకాశం ఉంటుంది.ఈ కారణంగానే కిడ్నీలో రాళ్లు ఉన్న వారు,గౌట్ వ్యాధితో బాధ పడేవారు క్యాలీఫ్లవర్ నురోజువారీ ఆహారంలో తగ్గించుకుంటే మంచిదనిచెప్తున్నారు.

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు తినవలసిన ఆహార పదార్థాలు ఇవే

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు తినవలసిన ఆహార పదార్థాలు ఇవే


ఇక కిడ్నీలో రాళ్లతో బాధపడేవారుతినాల్సిన పదార్థాలు విషయానికి వస్తే వారు అరటి పండ్లు,పైనాపిల్,బత్తాయి, దానిమ్మపళ్ళనుతినవచ్చు.బాదం పప్పును తినవచ్చు.వారు కొబ్బరి బోండాలు తాగవచ్చు.బార్లీ బియ్యాన్ని, మొక్కజొన్నలను, ఉలవలనుతినవచ్చు. క్యారెట్లను,కాకరకాయలను, నిమ్మకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.అంతే కాదు వారు చేపలను కూడా తినవచ్చు.


disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? అయితే ఈ రోగాలకు ఆహ్వానం పలుకుతున్నట్టే!!health tips: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా? అయితే ఈ రోగాలకు ఆహ్వానం పలుకుతున్నట్టే!!

English summary
Are you suffering with kidneys stones? experts suggest to know what to eat and what not to eat and change the food rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X