బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుమారస్వామి ప్రమాణస్వీకారం, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం, దెబ్బకు బ్యాంక్వేట్ హాల్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కుమారస్వామి ప్రమాణస్వీకారం, బెంగళూరు చేరుకున్న ప్రముఖుల అవస్థలు

బెంగళూరు: బెంగళూరు నగరంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. ఈ సందర్బంలో బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

ఉరుములు, మెరుపులు

ఉరుములు, మెరుపులు

బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యనున్న విధాన సౌధ దగ్గర వర్షం పడుతోంది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి పదవీస్వీకార కార్యక్రమానికి వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

బ్యాంక్వేట్ హాల్

బ్యాంక్వేట్ హాల్

విధాన సౌధలోని బ్యాంక్వేట్ హాల్ లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంక్వేట్ హాల్ ల్లోకి ప్రముఖులు మాత్రమే వెల్లడానికి అవకాశం ఉంది. అయితే బుధవారం సాయంత్రం 4.30 గంటలకు వర్షం పడటం తగ్గిపోతే అనుకున్నట్లే విధాన సౌధ ముందు భాగంలో హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు.

బెంగళూరులో ప్రముఖులు

బెంగళూరులో ప్రముఖులు

కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే ప్రముఖులు బెంగళూరు చేరుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నారా చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ మంత్రి అమరనాథరెడ్డి, సీఎం రమేష్ తదితరులు బెంగళూరు చేరుకున్నారు.

అభిమానుల ఆందోళన

అభిమానుల ఆందోళన

కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావడానికి కర్ణాటకలోని వివిద జిల్లాల నుంచి పెద్దఎత్తున జేడీఎస్ కార్యకర్తలు బెంగళూరు చేరుకున్నారు. బుధవారం మద్యాహ్నం 1 గంటకే జేడీఎస్ కార్యకర్తలు విధాన సౌధ ముందు గుమికూడారు. భారీగా వర్షం పడటంతో జేడీఎస్ కార్యకర్తలు చెట్ల కిందకు పరుగు తీశారు.

English summary
Karnataka Election results 2018: Heavy rains in bengaluru, JDS state chief HD Kumaraswamy to be sworn in as 25th chief minister of Karnataka today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X