Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Heeraben Modi : తల్లితో ప్రధాని మోడీకి వీడదీయరాని బంధం-ఈ ఫొటోలే చెబుతాయి..

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ ఇవాళ అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్దితి విషమించడంతో హడావిడిగా గుజరాత్ లోని అహ్మదాబాద్ వెళ్లి ఆమెను పరామర్శించి వచ్చిన మోడీ.. ఇవాళ ఆమె కన్నుమూయడంతో విషాదంలో మునిగిపోయారు. తల్లీ కొడుకుల అనుబంధం మరపురానిదే అయినా హీరాబాతో మోడీ బంధం మాత్రం ఇందులో చాలా ప్రత్యేకం. గతంలో పలుమార్లు సోషల్ మీడియాలో మోడీ షేర్ చేసుకున్న ఫొటోల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది.

ప్రధాని మోడీ ప్రతీ ఏటా తన తల్లి హీరాబా మోడీని ఆమె పుట్టిన రోజున తప్పకుండా కలుసుకునే వారు. అలాగే తన పుట్టినరోజులకూ గుజరాత్ వెళ్లి కలిసేవారు. ఈ సందర్భంగా ఆమె ఆశీర్వాదం తీసుకున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే వారు. ఈ ఏడాది కూడా హీరాబా 100వ పుట్టినరోజు సందర్భంగా మోడీ ఇలా వెళ్లి హీరాబాను కలిశారు. ఆమె లేవలేని పరిస్దితుల్లో ఉన్నప్పటికీ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. దీంతో ఈ తల్లీ కొడుకుల బంధం మరోసారి అందరినీ ఆకట్టుకుంది.

Heeraba Modi : bond between pm modi and his mother shared in pictures
ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా ఎంత బిజీగా ఉన్నా నరేంద్రమోడీ తన తల్లిని మర్చిపోలేదు. ఆమెను తనతో పాటే కలిసి ఉంచుకునే అవకాశం ఉన్నా ఆమె మాత్రం స్వస్ధలానికే పరిమితమయ్యారు. దీంతో మోడీ అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్లి ఆమెను కలిసి వచ్చేవారు. ఈ సందర్భంగా వారి కుటుంబం, ప్రధానిగా తాను గడుపుతున్న జీవితం, ఇతర విషయాల గురించి ఆమెతో చర్చించేవారు.
Heeraba Modi : bond between pm modi and his mother shared in pictures

అలాగే ఆమె ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించేవారు. ఎప్పుడే సమస్య వచ్చినా వాలిపోయే మోడీపై ఆమె కూడా అదే ఆప్యాయత చూపేవారు. దీంతో మోడీ-హీరాబా తల్లీ కొడుకుల బంధం ఓ దేశ ప్రధాని తన తల్లితో బంధం కంటే అపురూపంగా నిలిచింది.

Heeraba Modi : bond between pm modi and his mother shared in pictures

తనకు జన్మనిచ్చి ఇన్నాళ్లూ పెంచి పోషించి ఈ స్ధాయికి తెచ్చిన తల్లి హీరాబా చనిపోయిందన్న వార్తతో విషాదంలో మునిగిపోయిన ప్రధాని మోడీ.. ఆమెను చివరిచూపు చూసుకునేందుకు గుజరాత్ బయలుదేరి వెళ్లారు. స్వయంగా ఆమె పాడి మోసి తల్లిపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎక్కడా ప్రధాని అన్న డాంబికాన్ని ప్రదర్శించకుండా ఓ తల్లికి కొడుకుగానే కనిపించారు. దీంతో మోడీని చూసిన వారంతా ఆయన కంటే ఎక్కువగా బాధపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+