దారితప్పిన గవర్నర్ విద్యాసాగర్ రావు హెలికాప్టర్
హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు హెలికాప్టర్ దారి తప్పడంతో కాసేపు కలకలం రేగింది. శుక్రవారం విద్యాసాగర్ రావు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్‌కు బయల్దేరిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది.
అయితే.. నాందేడ్‌కు వెళ్లాల్సిన హెలికాప్టర్ కాస్తా దారి తప్పి, అనుకోకుండా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది.

దాదాపు 15 నిమిషాలపాటు ఈ పరిసర ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత మళ్లీ హెలికాప్టర్‌ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. చివరకు సురక్షితంగా హెలికాప్టర్ లాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన విద్యాసాగర్ రావును మహారాష్ట్రకు గవర్నర్‌గా నియమిస్తూ 2014 ఆగస్ట్ 26న రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీకి చెందిన ఆయన, గతంలో కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.












Click it and Unblock the Notifications