హెల్మెట్ పెట్టుకోని పోలీసులు.. ఫైన్ వేసిన ప్రజలు

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్ కతా: రోడ్డు మీద బైక్ కనిపిస్తే చాలు.. హెల్మెట్ లేదని, లైసెన్స్ లేదని, సరైన పత్రాలు లేవని చెప్పి జరిమానాలు కట్టించుకునే పోలీసులకు కోల్ కతా ప్రజలు షాక్ ఇచ్చారు. ఈ సంఘటన నదియా జిల్లాలో జరిగింది.

నలుగురు పోలీసులు హెల్మెట్ ధరించకుండా రెండు బైకులపై దూసుకుపోతున్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆపి హెల్మెట్ లేకుండా ప్రయాణించడం నేరమని, జరిమానా చెల్లించాలని కోరారు.

Helmet lesson for cops, Youths force errant constable's boss to extract fine

దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు. అయినా ఏమాత్రం తగ్గని స్థానికులు ''మీకో న్యాయం, మాకో న్యాయమా.. కుదరదు.. జరిమానా కట్టాల్సిందే..'' అంటూ తేల్చి చెప్పారు.

అయినప్పటికీ ఆ పోలీసులు జరిమానా చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి హెల్మెట్ ధరించకుండా బైక్ పై ప్రయాణించిన పోలీసులచే రూ.వంద చొప్పున జరిమానా కట్టించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
They say practise what you preach. A police constable in Nadia today learnt what it actually means. A group of village youths today caught the police constable riding a motorcycle without helmet at the same spot where cops have been fining bikers for the offence as part of the chief minister's Safe Drive, Save Life intiative.
Please Wait while comments are loading...