వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కూతుర్ని అలా చూడలేకపోతున్నా: చివరి అవకాశం మిమ్మల్ని అర్థించడమే

నా ఏడేళ్ల కూతురు ప్రాండ్య అందరి పిల్లల కంటే భిన్నంగా జీవిస్తోంది. ఆమె తండ్రిగా నేను ఈ మాటలు చెప్పడం లేదు.

|
Google Oneindia TeluguNews

నా ఏడేళ్ల కూతురు ప్రాండ్య అందరి పిల్లల కంటే భిన్నంగా జీవిస్తోంది. ఆమె తండ్రిగా నేను ఈ మాటలు చెప్పడం లేదు. నా కూతురును నేను గుండెలోతుల్లో నుంచి ప్రేమిస్తున్నాను. తన వయస్సులో ఉన్న పిల్లల వలె ఆమె జీవించడం లేదు. అందుకే నేను భిన్నమైనదని చెబుతున్నాను. బొమ్మలు, ఇతర వస్తువులతో ఆడుకోవాల్సిన వయస్సులో సిరెంజిలు వంటి వాటితో జీవిస్తోంది. తన స్నేహితుల గురించి నాకు చెప్పాల్సిన వయస్సులో డాక్టర్లు, నర్సుల గురించి నా వద్ద మాట్లాడుతోంది. ప్రతి 15 రోజులకు ఓసారి ఆమెను పార్కుకు తీసుకు వెళ్లడానికి బదులు నేను నా కూతురు ప్రాండ్యను బ్లడ్ ట్రాన్స్‌ఫ్యుజన్ కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్తున్నాను. ఆమె తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఆరు నెలల వయస్సు నుంచి ఆమెకు ఉంది. ఆరున్నర ఏళ్ల తర్వాత కూడా ఆమెకు ట్రాన్స్‌ఫ్యూజన్స్ జరుగుతున్నాయి. నా కూతురు ముఖంలో ఎప్పుడూ అందమైన చిరునవ్వు ఉంటుంది. అదే నాకు ఇప్పటికీ బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.

నా పేరు అనిల్ సాల్వే. ఉబెర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాను. నాకు నెలకు రూ.15,000 వస్తాయి. నా కూతురును ఈ కూపం నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు బోన్ నారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం. అందుకు రూ.2,00,000 అవసమవుతాయి. నేను నా కూతురుకు అందరిలా సాధారణ జీవితం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నా వద్ద అంత డబ్బు లేదు. దయచేసి నా కూతురు ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయండి.

ప్రాండ్యా మే 14, 2010లో జన్మించింది. ఆరు నెలల వరకు అందరిలాగే ఉండేది. ఆనందంగా పెరిగింది. ఆ తర్వాతే ఆమెలో క్రమంగా మార్పు కనిపించింది. అదే వయస్సులో ఉన్న ఇతర పిల్లల కంటే భిన్నంగా కనిపించింది. కళ్లు, ముఖంలో జీవచ్ఛవంలా కనిపించేవి. ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లాము. ఆమెకు రక్త పరీక్షలు చేశారు. నా కూతురుకు తలసేమియా ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు.

మీరు సహాయం చేస్తే నా కూతురును ఈ వ్యాధి నుంచి బయటపడేయగలను. నా కూతురు ప్రాండ్యకు నిత్యం పరీక్షలు, ట్రాన్స్‌ఫ్యుజన్ చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. నా కూతురు చేతులకు పలుమార్లు సూదులు గుచ్చుతుంటే నా గుండె తరుక్కుపోతుంది. మొదటిసారి ఇది చూసినప్పుడు నాకు మూర్చపోయినంత పని అయింది. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ట్రాన్స్‌ఫ్యూజన్స్, ఇంజక్షన్స్‌తో పాటు ప్రతి రోజుకు 8 టాబ్లెట్ల్స్ ఇవ్వాలి. గొంతు నుంచి ఆమె శరీరంలోకి ఓ పైప్ వేశారు. అదే ఆసుపత్రిలో అదే వయస్సులో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టగా చూశాను. అందుకు పిల్లలను నేను ఏమీ అనడం లేదు. పిల్లలు అలాగే ఉంటారు. కానీ నా కూతురు అలాంటి పరిస్థితుల్లో ఉండి నన్ను అర్థం చేసుకున్నందుకు నేను చాలా లక్కీ.

ఎక్కువ ఇన్‌ఫెక్షన్ ఉంటుందని నా కూతురును ప్రత్యేక వార్డులో ఉంచారు. కేవలం తల్లిని మాత్రమే ఉండనిస్తున్నారు. గత 15 రోజులుగా నా కూతురుతో నేను కేవలం వీడియో కాల్స్‌లోనే మాట్లాడుతున్నాను. టెస్టుల అనంతరం ఆమె డ్రాయింగ్ వేసుకుంది. తనకు ఇష్టమైన షో తారక్ మెహ్తా ఊల్టా చష్మా చూస్తుంది. తన పరిస్థితిపై నేను ఆందోళనగా ఉన్నాను. కొద్ది రోజుల క్రితమే మాకు తెలిసిందేమంటే.. మా చిన్న కుమార్తె బ్లడ్ స్వరలి బ్లడ్ శాంపిల్స్‌తో సరిపోలాయి. కాబట్టి ప్రాండ్యాకు డోనర్‌గా ఉపయోగపడుతుంది. ఫండ్స్ రూపంలో సాయం చేస్తే ఇది నిజమవుతుంది.

నా కూతురు ప్రతి 15 రోజులకు ఓసారి ఆసుపత్రికి వెళ్తూ ఉండొద్దని, ఆ జీవితం ఆమెకు వద్దని నా ఆశ. దురదృష్టవశాత్తూ నాకు వచ్చే జీతంతో నేను ఆమెను బాగు చేయించలేను. నాకు వచ్చే వేతనం మా ఇంటి ఖర్చు, నా కూతురు మెడిసిన్స్‌కు ఖర్చు చేయడమే చాలా కష్టంగా ఉంది. ఇప్పటి వరకు నేను నా కూతురుకు రూ.6,50,000 ఖర్చు చేశాను. నేను పొదుపు చేయడంతో పాటు పలు సేవా సంస్థల సాయం వల్ల ఆ డబ్బును ఖర్చు చేయగలిగాను. నా కూతురు కోసం నేను అన్ని విధాలా చేశాను. ఇప్పుడు ప్రజల నుంచి సాయం కోసం అర్థిస్తున్నాను. ఇప్పుడు నాకు మిగిలి ఉన్న ఆఖరి అవకాశం ఇది మాత్రమే.

ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత నా కూతురు ప్రాండ్యా దాదాపు ఏడాది పాటు ఇంటెన్సివ్ పోస్ట్ ట్రీట్మెంట్‌లో ఉంటుంది. ఆమెకు అన్ని విధాలా బాగుండేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆమెకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ సోకకుండా అ గది దుమ్ము, దూళి లేకుండా పరిశుభ్రంగా ఉండాలి. వీటన్నింటికి ఎంతో డబ్బు కావాలి. కానీ ఇప్పుడు నా ఆలోచన అంతా ఆమె బోన్ నారో ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించే.

మీరు చేసే సాయం నాకు ఎంతో అవసరం. దయచేసి కెట్టో ఫండ్ రైజర్ ద్వారా సాయం చేయండి.

English summary
My 7-year-old daughter Pradnya is very unique. I’m not saying this because like any father, I love my daughter with all my heart. I say that because I feel she’s very different from any other girl her age. In place of dolls and crafts, she’s dealing with syringes and transfusions. Instead of talking about her friends to me, she discusses the doctors and nurses she’s fond of. Every 15 days, instead of taking her to the park, I take my Pradnya to the hospital to get life-saving blood transfusions. She’s a thalassemia patient - she’s been getting these since she was just 6 months old. After 6.5 years, over hundred transfusions later, my daughter still wears the most beautiful smile on her face. It’s that smile that gets me going and gives me the strength to fight this battle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X