మోస్ట్ ఎఫెక్టెడ్ : లాక్ డౌన్‌లో నెత్తురోడిన రోడ్లపై ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో తెలుసా?
కరోనా లాక్ డౌన్ కారణంగా అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది,అవుతున్నది వలస కూలీలు,కార్మికులే. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మార్చి 25వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో నగరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తల్లడిల్లిపోయారు. తిండి లేక,ఉపాధి లేక,నిలువ నీడ లేక.. ఆపద కాలంలో అయినవాళ్లకు దగ్గరగా ఉండలేక విలవిల్లాడిపోయారు. ఈ క్రమంలో చాలామంది కాలి నడకనే స్వస్థలాల బాట పట్టారు. అయితే ఇందులో కొంతమంది ఇల్లు చేరకముందే మధ్యలోనే ప్రాణాలు విడిచారు. కొందరు ఆకలి,డీహైడ్రేషన్ కారణంగా మరణిస్తే.. మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అయితే ఇలా మరణించిన వలస కార్మికుల,కూలీల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా అంటే అనుమానమే. తాజాగా సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే ఓ ఎన్జీవో ఈ లెక్కలను బయటపెట్టింది.

ఎన్ని రోడ్డు ప్రమాదాలు.. ఎంతమంది మరణించారు..
మార్చి 25వ తేదీ నుంచి మే 31 వరకు కొనసాగిన లాక్ డౌన్ పీరియడ్‌లో దేశవ్యాప్తంగా 1461 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో సుమారు 750 మంది మృతి చెందగా.. ఇందులో 198 మంది వలస కార్మికులు ఉన్నారు. మొత్తంగా 1390 మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డారు. లాక్ డౌన్ పీరియడ్‌లో సంభవించిన మొత్తం మరణాల్లో స్వస్థలాలకు తిరిగి వెళ్లే క్రమంలో చనిపోయిన వలస కార్మికులు 26.4శాతం మంది. అలాగే 5.3శాతం మంది అత్యవసర కార్మికులు. మొత్తంగా 68.3శాతం మంది లాక్ డౌన్ పీరియడ్‌లో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.

రాష్ట్రాలవారీగా డేటా..
లాక్ డౌన్ పీరియడ్‌లో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినవారిలో ఉత్తరప్రదేశ్ 30శాతం(245),తెలంగాణలో 56,మధ్యప్రదేశ్‌లో 56,బీహార్‌లో 43,పంజాబ్‌లో 38,మహారాష్ట్రలో 36 మంది మృతి చెందారు. ఇక రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది వలస కార్మికులు మృతి చెందిన రాష్ట్రాలను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్-94,మధ్యప్రదేశ్-38,బీహార్-16,తెలంగాణ-11,మహారాష్ట్ర-9 ఉన్నాయి. మీడియా ట్రాకింగ్,ఇతరత్రా మార్గాల ద్వారా ఈ డేటాను సేకరించినట్టు సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెల్లడించింది.

సుమారు 200 మంది...
రోడ్డు ప్రమాద బాధితులలో 27% మంది వలస కార్మికులు కాగా, 5% మంది పోలీసులు, వైద్యులు మరియు ఇతర అత్యవసర సేవల విభాగానికి చెందినవారు ఉన్నారు. మొత్తం మరణాల్లో 68% మంది పాదచారులు, ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్స్ ఉన్నాయి. 'లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి సుమారు 200 మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. వీరంతా సైకిళ్లు,కాలినడకన లేదా భారీ వాహనాలు,లైట్ వెహికల్స్‌లో స్వస్థలాలకు బయలుదేరినవారు. కొంతమంది బస్సుల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురైనవారు కూడా ఉన్నారు. ఇందులో చాలా ప్రమాదాలు అతివేగంతో పాటు ఒక్కడే డ్రైవర్ ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసి అలసిపోవడం వల్ల సంభవించినవి.

సేవ్ లైఫ్ ఫౌండేషన్ సీఈవో ఏమంటున్నారు..
మొత్తం నాలుగు విడతల లాక్ డౌన్‌లో నాలుగో విడతలో సుమారు 322 మంది(42శాతం) రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 19శాతం మంది వలస కార్మికులు ఉన్నారు. మొత్తం ప్రమాదాల్లో 43శాతం ప్రమాదాలు ఒక వాహనం మరో వాహనంతో ఢీకొట్టడంతో సంభవించినవే. మరో 15శాతం ప్రమాదాలు అతివేగం కారణంగా సంభవించాయి. ఇప్పటికే కరోనాతో నిరంతరం పోరాడుతున్న వైద్య వ్యవస్థపై రోడ్డు ప్రమాదాలు మరింత భారాన్ని మోపుతాయని సేవ్ లైఫ్ ఫౌండేషన్ సీఈవో పీయుష్ తివారీ పేర్కొన్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాత రోడ్డు ప్రమాదాలు పెరిగాయని.. కాబట్టి పౌరులు రోడ్డు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications