
గూగుల్ తల్లీ నమో నమః - మనోళ్లు ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు ఇవే: ప్రెగ్నెన్సీ కూడా..
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం చివరికొచ్చింది. ఇంకొద్ది రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది ఇయర్ 2022. ఈ ఏడాదిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. రష్యా.. తన పొరుగు దేశం ఉక్రెయిన్‌పై దండెత్తింది. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి బ్రేకులు పడట్లేదు. నెలల తరబడి సాగుతోంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది కూడా ఈ ఏడాదే. బీజేపీ, కాంగ్రెస్‌ను కాదని కేజ్రీ పార్టీకి పట్టం కట్టారు పంజాబీయులు. ఎప్పట్లాగే ఐపీఎల్ 2022 ప్రేక్షకులను కట్టిపడేసింది.
సీబీఐ కేసులు నమోదైన ఎమ్మెల్యేలు-ఎంపీల్లో ఏపీ వాళ్లే టాప్..!!

గూగుల్ తల్లి ఆశ్రయం..
వాటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి గూగుల్ తల్లిని ఆశ్రయించారు నెటిజన్లు. ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలతో కూడిన జాబితాను గూగుల్ ఇవ్వాళ విడుదల చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, కోవిన్, ఫీఫా వరల్డ్ కప్.. అనే పదాలు అత్యధికంగా సెర్చ్ చేసిన వాటిల్లో ఉన్నాయి. నాటో, పీఎఫ్ఐ, అగ్నిపథ్ స్కీమ్, ఆర్టికల్ 370 వంటివీ ఇందులో ఉన్నాయి. వాట్ ఈజ్ అనే కేటగిరీ కింద విభిన్న రకాల అంశాల గురించి సెర్చ్ చేశారు.

నియర్ మీ..
నియర్ మీ అనే కేటగిరీలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ అగ్రస్థానంలో ఉంది. ఇదే కేటగిరీలో ప్రజలు తమ సమీపంలోని స్విమ్మింగ్ పూల్స్, వాటర్ పార్కులు, మాల్స్, మెట్రో స్టేషన్ల పెద్ద ఎత్తున ఆరా తీశారు. ఈ ఏడాదే కన్నుమూసిన లతా మంగేష్కర్, క్వీన్ ఎలిజబెత్, షేన్ వార్న్, హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా పేర్ల గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, హర్ ఘర్ తిరంగా పట్ల కూడా ప్రజలు ఆసక్తి కనపర్చారు.

స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో..
స్పోర్ట్స్ ఈవెంట్‌లల్లో ఐపీఎల్ టాప్‌లో ఉంది. ఆ తరువాతి స్థానం ఫిఫా వరల్డ్ కప్‌దే. ఆసియా కప్ 2022 గురించి కూడా బాగానే సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. సినిమాల విషయంలో బ్రహ్మాస్త్ర టాప్‌లో నిలిచింది. ఆ తరువాత కేజీఎఫ్ 2 ఉంది. ట్రెండింగ్ సినిమాల్లో ది కాశ్మీర్ ఫైల్స్, దృశ్యం 2, ఆర్ఆర్ఆర్, పుష్ప, కాంతారా, థోర్- లవ్ అండ్ థండర్ గురించి ఎక్కువ మంది గూగుల్ తల్లిని అడిగారు.

హౌ టు కేటగిరీలో..
హౌ టు అనే కేటగిరీలో వ్యాక్సిన్, ప్రభుత్వ డాక్యుమెంట్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ప్రెగ్నెన్సీ.. గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు నెటిజన్లు. వంటకాల విషయంలో- పనీర్ పసంద, మలై కోఫ్తా, పనీర్ బుర్జీ పదాలు అత్యధికంగా సెర్చింగ్ చేసిన వాటిల్లో టాప్‌లో నిలిచాయి. మోదక్, చికెన్ సూప్, పాన్ కేక్ గురించీ శోధించారు. వ్యక్తుల కేటగిరీలో నూపుర్ శర్మ, ద్రౌపది ముర్ము, రిషి సునక్ పేర్లు అగ్రస్థానంలో ఉన్నట్లు గూగుల్ వివరించింది.