కష్టాల కడలిలో కమలం: ఆనందీకి పట్టని మోదీ సమయస్ఫూర్తి.. రూపానీ మెరుగైనా టైం లేదు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర ఆర్థిక ప్రగతి నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నది. కానీ మూడేళ్ల క్రితం వివిధ సామాజిక వర్గాలు చేపట్టిన ఆందోళనలను ప్రత్యేకించి పాటిదార్లు, దళితుల ఆందోళనలను సరైన రీతిలో నియంత్రించడంలో విఫలం కావడంతో అధికార బీజేపీకి ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. 2001లో గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ బాద్యతలు స్వీకరించినప్పటి నుంచి 2014లో ప్రధానిగా ఎన్నికయ్యే వరకు ఆ రాష్ట్రం ఆర్థిక రంగంలో పురోభివ్రుద్ధి సాగిస్తూనే వచ్చింది.
2014 మేలో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా గుజరాత్ రాష్ట్ర ప్రగతిలో ఎటువంటి తేడా లేదని గణాంకాలు చెప్తున్నాయి. తాజాగా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆదరాబాదరాగా అమలులోకి తెచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విషయమై గుజరాతీ వ్యాపారుల్లో తీరని అసమ్మతిని, ప్రతికూలతను పెంపొందించింది.

గుజరాత్‌లో మోదీ చరిస్మా కొడిగడుతోందా?

గుజరాత్‌లో మోదీ చరిస్మా కొడిగడుతోందా?

పెద్ద నోట్లరద్దుతోపాటు జీఎస్టీ అమలుపై వ్యాపారులు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రధాని మోదీ చరిస్మా క్రమంగా తగ్గుముఖం పట్టగా, విధాన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడిందన్న విమర్శలు ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రానికి గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‍డీఐ) 3,367 మిలియన్ల డాలర్లు వస్తే, 2014 - 15తో పోలిస్తే అది రెట్టింపు. 2014 - 15లో 1531 మిలియన్ల డాలర్ల విలువ చేసే ఎఫ్‌డీఐలు మాత్రమే వచ్చాయి. 2015 - 16లో రాష్ట్ర స్థూల ఆర్థిక ప్రగతి 9.2 శాతం కాగా, 2014 -15లో అది 7.8 శాతంగా నిలిచింది. ఉత్పాదక రంగం 2014 - 15లో ఎనిమిది శాతం వ్రుద్ధి సాధించగా, 2015 - 16లో 12 శాతానికి పెరిగింది. అత్యధికంగా నిర్మాణ రంగం లబ్ది పొందింది. గుజరాత్ రాష్ట్రంలో రెవెన్యూ ప్రగతి గత ఐదేళ్లలో సింగిల్ డిజిట్‌లోకి పడిపోవడం ఆందోళనకరమని విశ్లేషకులు అంటున్నారు.

వైబ్రంట్ గుజరాత్‌లో ఇలా పర్యవేక్షణ

వైబ్రంట్ గుజరాత్‌లో ఇలా పర్యవేక్షణ

‘మోదీ ఒక మైక్రో మేనేజర్‌గా వ్యవహరిస్తారు. గుజరాత్ సీఎంగా తొలిసారి హోదాలో ‘గుజరాత్ వైబ్రంట్' సదస్సు నిర్వహించడం మొదలు ఇటీవలి గుజరాత్ వైబ్రాంత్ వరకు ప్రతి క్షణం సదస్సులో జరిగే పరిణామాలపై వాకబు చేస్తూ దానికి హాజరైన ప్రముఖులు ప్రత్యేకించి కార్పొరేట్ల సమస్యలు అడిగి తెలుసుకునే వారు. సదస్సులో సీట్ల ఏర్పాటు మొదలు భోజన వసతి కల్పన తదితర అంశాలను అతి దగ్గర నుంచి పర్యవేక్షించే వారు. ఇటువంటి అంశాలన్నీ మేం తేలికయ్యేందుకు వీలు కల్పించేవి' అని మోదీతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో అతి సన్నిహితంగా వ్యవహరించే అధికారి ఒకరు చెప్పారు.

మోదీకి ఇలా అధికార యంత్రాంగంపై పట్టు

మోదీకి ఇలా అధికార యంత్రాంగంపై పట్టు

ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా గుజరాత్ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో తేడా లేదని ఆ రాష్ట్రంలోనే ఆర్థిక నిపుణుడు అచ్యుత్ యాగ్నిక్ పేర్కొన్నారు. మోడీ ఆలోచనల ప్రకారం గుజరాత్ రాష్ట్ర మోడల్ అభివ్రుద్ధి మొత్తం అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల చుట్టే ఉంటుందని, మోదీ విధానాల ద్వారా కార్పొరేట్లు లబ్ది పొందుతుంటారని అచ్యుత్ యాగ్నిక్ తెలిపారు. ‘అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లోనే మొత్తం తేడా ఉంది. అధికార యంత్రాంగంపై మోదీ సీఎంగా పట్టు కలిగి ఉండే వారు. కానీ ఆయన వారసురాలిగా ఆనందీబెన్ పటేల్, తర్వాత సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్ రూపానీ ఆ పని చేయలేకపోయారు.

లక్ష్యాల సాధనకే ఇలా ఆనందీ ప్రాధాన్యం

లక్ష్యాల సాధనకే ఇలా ఆనందీ ప్రాధాన్యం

2014లో ప్రధాని నరేంద్రమోదీ స్థానంలో గుజరాత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆనందీ బెన్ పటేల్.. నరేంద్రమోదీ తరహా పరిపాలనలో విఫలం అయ్యారు. సీఎంగా ఆనందీబెన్ పటేల్ చాలా కఠినంగా వ్యవహరించే వారు. నరేంద్రమోదీ క్యాబినెట్‌లో సహచరిగా ఆమె రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా కఠినంగా వ్యవహరించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత కఠినాత్మురాలిగా మారిపోయారు. అధికారిక సమీక్షా సమావేశాల్లో అధికారుల పట్ల గౌరవ ప్రదంగా వ్యవహరించే వారు కాదన్న విమర్శ ఉండేది.

ఏ దశలోనూ అధికారులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించని ఆనందీ

ఏ దశలోనూ అధికారులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించని ఆనందీ

సహజంగానే సమీక్షా సమావేశాల్లో తన ఆలోచనలు, లక్ష్యాల సాధనపైనే కేంద్రీకరించే వారు తప్ప.. ఆయా పథకాలు, కార్యక్రమాల అమలు కోసం సీనియర్ ఐఏఎస్ అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. తాను నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులపై ఒత్తిడి తేవడంతో ఏ ఐఎఎస్ అధికారి కూడా తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ముందుకు వచ్చేవారు కాదు. ఆమె కూడా ఐఏఎస్ అధికారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవని ఓ అధికారి తెలిపారు.

హుందాగా వ్యవహరిస్తున్న మోదీ

హుందాగా వ్యవహరిస్తున్న మోదీ

కానీ ప్రధాని మోదీ కఠినమైన టాస్క్ మాస్టర్ అయినా వివిధ సామాజిక వర్గాలపై, అధికారులు, వ్యాపార, వాణిజ్య వర్గాల పట్ల గౌరవం ప్రదర్శించే వారు. ఆయన నిర్వహించే సమీక్షా సమావేశాలు కూడా హుందాగా సాగేవని వినికిడి. రెండేళ్ల పాటు ఆనందీబెన్ పటేల్ సీఎంగా ఉన్నప్పుడు అధికారులు నోరు మెదిపే వారే కాదని సమాచారం. మోదీ సీఎంగా ఉన్నప్పుడు అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రకటించడం వల్ల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతూ వచ్చిందని అధికారులు చెప్తున్నారు. కానీ ఆనందీబెన్ పటేల్ మాత్రం సీఎంగా మోదీ బ్రాండ్‌ను కొనసాగించడంలో విఫలం అయ్యారని సమాచారం. నిరంతరం పనులు, ప్రాజెక్టులు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నా ‘మోదీ తరహా బ్రాండ్' కొనసాగించకపోవడంతో అధికారులు నోరు విప్పే వారు కాదని తెలుస్తోంది.

రియల్ ఎస్టేట్ లాబీ వల్లే ఆనందీ ఇలా ఔట్

రియల్ ఎస్టేట్ లాబీ వల్లే ఆనందీ ఇలా ఔట్

పాటిదార్ల ఆందోళన ఉధ్రుత స్థాయికి చేరుకున్న తర్వాత గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్‌ను ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సారథ్యంలోని బీజేపీ నాయకత్వం పక్కకు తప్పించేసింది. విద్యా ఉద్యోగ రంగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన బాట పట్టిన సొంత సామాజిక వర్గం ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవడంలో విఫలం కావడంతోనే ఆనందీబెన్ పటేల్‌ను తప్పించారని సమాచారం. ఇప్పటికీ ధ్రువీక్రుతం కానీ నివేదికల ప్రకారం 2016లో ఆనందీబెన్ పటేల్ నిష్క్రమణకు రియల్ ఎస్టేట్ లాబీ కుట్ర పూరితంగా వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

రంగంలోకి దిగే లోపే ముందుకు కదిలిన ప్రధాని మోదీ

రంగంలోకి దిగే లోపే ముందుకు కదిలిన ప్రధాని మోదీ

ఆనందీబెన్ పటేల్ స్థానే సీఎంగా విజయ్ రూపానీని ఎంపిక చేసిన మోదీ - షా జోడీ రాష్ట్రానికి భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల గురించి ఏడాది కాలంగా మీడియాలో విస్త్రుతంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఆనందీబెన్ పటేల్‌తో పోలిస్తే విజయ్ రూపానీ అధికారులతో ఎలాగైనా కలిసిపోయేలా ఉండేవారు. కానీ ఆయన మార్పు తీసుకొచ్చారా? లేదా? అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. దీనికి తోడు ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత బీజేపీని వెంటాడుతూ వచ్చింది. మోదీ సీఎంగా ఉన్నప్పుడు అత్యధికులు ఎమ్మెల్యేలను మార్చేసేవారు. ఆయన తన పేరుపైనే ప్రజా తీర్పు కోరే వారు. సీఎం విజయ్ రూపానీ తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోకముందే ప్రధాని మోదీ ముందుకు కదిలారు. జీఎస్టీ, నోట్ల రద్దు అమలుతోపాటు ప్రజా వ్యతిరేకత, దళితులు, పాటిదార్ల ఆందోళన అధికార బీజేపీకి కఠిన యుద్ధ క్షేత్రంగా మారిపోయాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
State continues to grow but handling of Patidar and Dalit agitations could have negative impact. It is said Gujarat made economic strides under the stewardship of Narendra Modi between 2001 and 2014. The data, however, suggest Modi’s absence after his elevation as the Indian prime minister in May 2014 has not made much difference to economic growth in the state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి