కలకలం: మిలిటరీ బేస్‌ సమీపంలో అనుమానాస్పద బ్యాగులు.. పఠాన్‌కోట్‌లో హై అలర్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

పఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం రేగింది. మిలిటరీ బేస్‌ సమీపంలో రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో పఠాన్‌కోట్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్యాగులను తనిఖీ చేయగా.. అందులో మొబైల్‌ టవర్‌కు చెందిన బ్యాటరీలను గుర్తించారు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

High Alert After Two Suspicious Bags Found Near Pathankot Military Base

బుధవారం కూడా పఠాన్‌కోట్‌లో అనుమానిత వ్యక్తుల సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. కారులో వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బెర్హంపూర్‌ చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిని వెంబడించారు.

అయితే ఆ వ్యక్తులు కొద్ది దూరం వెళ్లాక మఖన్‌పూర్‌ గ్రామంలో కారును వదిలేసి పారిపోయారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారు నుంచి అనుమానించదగ్గ వస్తువులేవీ లభించలేదని పోలీసులు వెల్లడించారు.

గతంలో పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడులు జరిగిన సందర్భాలున్నాయి. గతేడాది జనవరి పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలోకి ఉగ్రవాదులు చొరబడి ఏడుగురు సిబ్బందిని చంపేసిన విషయం తెలిసిందే. తాజా ఘటనలతో పోలీసులు ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High alert was sounded in Pathankot on Thursday after two suspicious bags were found a few yards away from the military base. Punjab Police recovered mobile tower batteries from the bags. Security has been beefed up in the area and a search is on to find the owner of the bags. On Wednesday, an abandoned SUV was found near Gurdaspur district. A massive search operation has been launched to track down three persons who were spotted near the car.Police said the three had been directed to stop at a checkpost at Berhampur in the district, but instead speed through it. The cops then gave chase but found the vehicle abandoned at Makhanpur village near Bamiyal. "Nothing suspicious was found from the vehicle. The SUV had a fake registration number and was stolen from Jammu," police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి