Students: హిజాబ్, తీర్పు వచ్చిన గంటలో పరీక్షలు బహష్కరించిన అమ్మాయిలు, ఇంట్లో అడిగి !
బెంగళూరు/ యాదగిరి: హిజాబ్ వివాదానికి కర్ణాటక హైకోర్టు తీర్పుతో బ్రేక్ పడిందని చాలామంది అనుకున్నారు. ఇస్లాం మతంలో హిజాబ్ తప్పనిసరి కాదని మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వం సూచించిన యూనీఫామ్ లు మాత్రమే వేసుకుని స్కూల్స్, కాలేజ్ కు వెళ్లాలని, ఎలాంటి మతపరమైన దస్లులు ధరించి విద్యాసంస్థలకు వెళ్లకూడదని హైకోర్టు సూచించింది. కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పిన గంటలోనే పరీక్షలు రాస్తున్న ముస్లీం విద్యార్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. హిజాబ్ లు వేసుకోకుండా మేము పరీక్షలు రామయని చెప్పి ఒకేసారి 35 మంది విద్యార్థులు పరీక్షలు బహిష్కరించడం కలకలం రేపింది. హిజాబ్ తీసేసి పరీక్షలు రాయాలా ?, వద్దా ? అనే విషయం మా కుటుంబ సభ్యులను అడిగి చెబుతామని ముస్లీం అమ్మాయిలు పరీక్షలు బహిష్కరించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో హిజాబ్ తీర్పు తరువాత బెంగళూరు నగరంలో సహ కర్ణాటకలోని అనేక జిల్లాల్లోని విద్యాసంస్థల దగ్గర, పలు ప్రాంతాల్లోని సన్నితమైన ప్రాంతాల్లో కర్ణాటక పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

హైకోర్టు సంచలన తీర్పు
ఇస్లాం మతంలో హిజాబ్ అనేది ఒక భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లో వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికదాని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్ లు వేసుకోవాలని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

మతపరమైన దుస్తులు వద్దు
హిజాబ్ లు వేసుకునే విషయం పట్టుబట్టి హైకోర్టును ఆశ్రయించిన అమ్మాయిలకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వం సూచించిన యూనీఫామ్ వేసుకుని విద్యాసంస్థలకు వెళ్లాలని, హిజాబ్ లు, కాషాయకండవాలతో పాటు మతపరమైన దస్తులు దరించి విద్యాసంస్థల్లో అడుగుపెట్టడానికి అవకాశం లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.

అందరి వాదనలు విన్న హైకోర్టు
హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్తి, జస్టిస్ కృఫ్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ ఖాజీ జైబున్నీసా మోహిద్దీన్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ హిజాబ్ వివాదంపై దాఖలు అయిన అన్ని పిటిషన్లను విచారణ చేసి అందరి వాదనలను విన్నారు. చాలా రోజుల పాటు కర్ణాటక హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు వినిపించారు. అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం సంచలన తీర్పు చెప్పింది.

గంటలోనే అమ్మాయిలు రివర్స్
కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పిన గంటలోనే పరీక్షలు రాస్తున్న ముస్లీం విద్యార్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని సురపుర తాలుకాలోని కెంబావి ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు మంగళవారం పరీక్షలు రాస్తూ మద్యలో పరీక్షలు బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు.

ప్రిన్సిపాల్ చెప్పినా మాట వినలేదు
హిజాబ్ లు వేసుకోకుండా మేము పరీక్షలు రామయని చెప్పి ఒకేసారి 35 మంది విద్యార్థులు పరీక్షలు బహిష్కరించడం కలకలం రేపింది. పరీక్షలు రాసిన తరువాత బయటకు వెళ్లాలనని తాను ఎంత చెప్పినా విద్యార్థులు మామాట వినలేదని కాలేజ్ ప్రిన్సిపాల్ శకుంతల ఆమెను కలిసిన కన్నడ మీడియాకు చెప్పారు.

పరీక్షలు రాయాలా, వద్దా అని మా ఇంట్లో అడిగి చెబుతాము
హిజాబ్ తీసేసి పరీక్షలు రాయాలా ?, వద్దా ? అనే విషయం మా కుటుంబ సభ్యులను అడిగి చెబుతామని ముస్లీం అమ్మాయిలు పరీక్షలు బహిష్కరించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో హిజాబ్ తీర్పు తరువాత బెంగళూరు నగరంలో సహ కర్ణాటకలోని అనేక జిల్లాల్లోని విద్యాసంస్థల దగ్గర, పలు ప్రాంతాల్లోని సన్నితమైన ప్రాంతాల్లో కర్ణాటక పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications