వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిజాబ్ వివాదంలో ట్విస్టులు-అనుమతించని స్కూళ్ల-పరీక్షలకు దూరం-హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన

|
Google Oneindia TeluguNews

కర్నాటకలో మొదలైన ముస్లిం బాలికల హిజాబ్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే తమ తుది తీర్పు వచ్చే వరకూ హిజాబ్ కు దూరంగా ఉండాలంటూ హైకోర్టు సూచించడంతో కాలేజీలు ఈ మేరకు ఆంక్షలు పెడుతున్నాయి. ఈ ఆంక్షలకు నిరసనగా విద్యార్ధులు పరీక్షలకు దూరమవుతున్నారు. దీంతో పిటిషనర్ హైకోర్టు ఆదేశాల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ తిరిగి న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు.

 హిజాబ్ ట్విస్టులు

హిజాబ్ ట్విస్టులు

కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే హిజాబ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాషాయ శాలువాలతో నిరసనకు దిగుతున్న నేపథ్యంలో మూతపడిన కాలేజీలు, విద్యాసంస్ధలు.. తిరిగి హైకోర్టు ఆదేశాలతో తెరుచుకున్నాయి. అయితే హిజాబ్ ధరించి వస్తున్న విద్యార్ధినుల్ని కాలేజీలు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం ప్రభావం పరీక్షలపై పడుతోంది. దీంతో తిరిగి ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.

 హిజాబ్ అనుమతించలేదని పరీక్షల బహిష్కరణ

హిజాబ్ అనుమతించలేదని పరీక్షల బహిష్కరణ

కర్నాటకలోని కాలేజీల్లో విద్యార్ధినులు హిజాబ్ ధరించి రాకుండా హైకోర్టు ఆంక్షలు పెట్టడంతో కాలేజీలు వాటిని అమలు చేయడం మొదలుపెట్టాయి. అయితే తమ కాలేజీ యాజమాన్యాలు హిజాబ్ తో అనుమతించకపోవడంతో విద్యార్ధినులు పరీక్షలు రాయబోమని తేల్చిచెప్పేస్తున్నారు. ఇదే కోవలో ఉడుపి, శివమొగ్గలో ఇద్దరు విద్యార్ధినులు హిజాబ్ తో అనుమతించని కారణంగా పరీక్షలు రాసేందుకు ఇష్టపడలేదు. హిజాబ్ ను అనుమతించకపోతే పరీక్షలు రాయబోమని వారు తేల్చిచెప్పేశారు. దీంతో ప్రభుత్వ ఆంక్షల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

 హైకోర్టును క్లారిటీ కోరిన పిటిషనర్

హైకోర్టును క్లారిటీ కోరిన పిటిషనర్

హిజాబ్ ధరించి స్కూళ్లు కాలేజీలకు వచ్చే వారిని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఉల్లంధిస్తోందని ఈ కేసులో పిటిషనర్ ఆరోపించారు. ఈ కేసులో పిటిషనర్ తరఫు వాదిస్తున్న న్యాయవాది కామత్..."సవ్రాజనిక్ సువ్యవస్థే" అనే జిఓలోని పదబంధానికి "పబ్లిక్ ఆర్డర్" అని అర్ధం కాదని రాష్ట్రం చెబుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజ్యాంగం యొక్క అధికారిక కన్నడ అనువాదం ఈ పదాన్ని "సర్వజనిక్ సువ్యవస్థే" "పబ్లిక్ ఆర్డర్" కోసం ఉపయోగిస్తుందన్నారు. రాష్ట్రం ఈ వాదన చేయడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వ జీవోలోని పదాలు రెండు అర్ధాలు ఇవ్వలేవని వాదించారు.

అలాగే ఏ కోర్టు లేదా ప్రభుత్వమైన ఓ వ్యక్తి మతపరమైన సంప్రదాయాల్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. చివరిగా ప్రభుత్వ జీవోపై క్లారిటీ ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

English summary
two students in karnataka college have refuse to take exams due to college restrictions on hijab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X