హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab: బికినీలు, జీన్స్ వేసుకుంటారు, బుర్కా అయినా వేసుకుంటారు, మీకెందుకు ?, ప్రియాంకా గాంధీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ/హైదరాబాద్: హిజాబ్ (బుర్కా) వేసుకునే విషయంలో ఉడిపిలో మొదలైన వివాదం తరువాత ఆ జిల్లాను దాటి కర్ణాటక మొత్తం వ్యాపించింది. రాజకీయ రంగు పలుముకున్న హిజాబ్ వివాదం రాష్ట్రాలు దాటి దేశం మొత్తం పాకిపోయింది. అమ్మాయిలు హిజాబ్ లు, బుర్కాలు అయినా వేసుకుంటారు, బికినీలు అయినా వేసుకుంటారు, మీకెందుకు, అమ్మాయిలు పలానా దుస్తులు మాత్రమే వేసుకోవాలని భారతదేశ రాజ్యంగంలో ఏమైనా ఆంక్షాలు ఉన్నాయా ?, అమ్మాయిలకు ఇష్టమైన దుస్తులు వేసుకోనే హక్కు రాజ్యంగం కల్పించింది అనే విషయం కొందరు రాజకీయ నాయకులు మరిచిపోయారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు.

Recommended Video

Hijab Row: హిజాబ్ వివాదం Karnataka విద్యాసంస్థలకు సెలవు | Priyanka Gandhi | Oneindia Telugu

అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే తప్పు అంటారు, వాళ్లకు నచ్చిన దుస్తులు వేసుకుంటే తప్పు అంటూ రాద్దాంతం చేస్తారు అని ప్రియాంకా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ముస్లీం అమ్మాయిలు హిజాబ్ ధరించే విషయంలో కొందరు స్వార్థపరులు కావాలనే రాజకీయం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని పరోక్షంగా బీజేపీ నాయకుల, హిందూ సంఘ సంస్థల మీద ప్రియాంక గాంధీ విరుచుకుపడుతున్నారు.

Hijab Row: బుర్కాతో సమస్య కాదు, రోజు ఐదుసార్లు నమాజ్ అంటున్నారు, మంత్రి, అందుకే ఇలా!Hijab Row: బుర్కాతో సమస్య కాదు, రోజు ఐదుసార్లు నమాజ్ అంటున్నారు, మంత్రి, అందుకే ఇలా!

బాగా ముదిరిపోయింది

బాగా ముదిరిపోయింది

ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు (బుర్కాలు) వేసుకుని తరగతుల్లోకి రాకూడదని అక్కడి ప్రిన్సిపాల్ అడ్డుకోవడంతో వివాదం పెద్దది అయ్యింది. ఉడిపి నుంచి కుందాపురకు, తరువాత శివమొగ్గు, బాగల్ కోటే, బీజాపుర జిల్లాలకు హిజాబ్ వివాదం పాకిపోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

సోషల్ మీడియా పుణ్యమా అంటూ?

సోషల్ మీడియా పుణ్యమా అంటూ?

ముస్లీం అమ్మాయిలు హిజాబ్ ధరిస్తామని వాదిస్తుంటే, హిందువులు నుదిటి మీద తిలకం పెట్టుకుని మెడలో కాషాయం జెండాలు వేసుకుని కాలేజ్ కు వస్తామని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజాబ్ (బుర్కా) వేసుకునే విషయంలో ఉడిపిలో మొదలైన వివాదం తరువాత సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆ జిల్లాను దాటి కర్ణాటక మొత్తం వ్యాపించింది. రాజకీయ రంగు పలుముకున్న హిజాబ్ వివాదం రాష్ట్రాలు దాటి దేశం మొత్తం పాకిపోయింది.

విద్యాసంస్థలు క్లోజ్

విద్యాసంస్థలు క్లోజ్

హిజాబ్ వివాదం ముదిరిపోవడంతో బుధవారం నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హిజాబ్ లు ధరిస్తామని, కాషాయ కండువాలు వేసుకుంటామని కొందరు విద్యార్థులు మొండి పట్టుదలకు పోయారని, ఇదే విషయాన్ని కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఉపయోగించుకుని చిన్న విషయాన్ని పెద్దది చేశారని, ఈ వివాదం ఉడిపి, శివమొగ్గ జిల్ాల నుంచి బాగల్ కోటే, బీజాపురతో పాటు పలు జిల్లాలకు వ్యాపించిందని, అందుకే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి నాగేష్ చెప్పారు.

విద్యార్థుల డిమాండ్ వేరే ఉంది?

విద్యార్థుల డిమాండ్ వేరే ఉంది?

స్కూల్స్, కాలేజ్ ల్లోకి హిజాబ్ వేసుకుని వస్తామని చెబుతున్న కొందరు విద్యార్థులు క్లాసుల్లోకి వచ్చిన తరువాత మరో రకమైన కోరికలు కోరుతున్నారని, ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి, నాగేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిజాబ్ లు వేసుకుంటే మీకెందుకు ?, బికినీలు వేసుకుంటే మీకెందుకు

హిజాబ్ లు వేసుకుంటే మీకెందుకు ?, బికినీలు వేసుకుంటే మీకెందుకు

అమ్మాయిలు హిజాబ్ లు, బుర్కాలు అయినా వేసుకుంటారు, బికినీలు అయినా వేసుకుంటారు, మీకెందుకు, అమ్మాయిలు పలానా దుస్తులు మాత్రమే వేసుకోవాలని భారతదేశ రాజ్యంగంలో ఏమైనా ఆంక్షాలు ఉన్నాయా ?, అమ్మాయిలకు ఇష్టమైన దుస్తులు వేసుకోనే హక్కు రాజ్యంగం కల్పించింది అనే విషయం కొందరు రాజకీయ నాయకులు మరిచిపోయారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు.

జీన్స్ వేసుకున్నా గొడవలు చేశారు

జీన్స్ వేసుకున్నా గొడవలు చేశారు

గతంలో అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే తప్పు అంటారు, వాళ్లకు నచ్చిన దుస్తులు వేసుకుంటే తప్పు అంటూ రాద్దాంతం చేస్తారు అని ప్రియాంకా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ముస్లీం అమ్మాయిలు హిజాబ్ ధరించే విషయంలో కొందరు స్వార్థపరులు కావాలనే రాజకీయం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని పరోక్షంగా బీజేపీ నాయకుల, హిందూ సంఘ సంస్థల మీద ప్రియాంక గాంధీ విరుచుకుపడుతున్నారు.

English summary
Hijab Row: Congress leader Priyanka Gandhi Vadra spoke up in support of college students in Karnataka who have been banned from wearing the hijab in classrooms, tweeting that the choice of what clothes to wear was theirs alone, and that this right is protected by the Constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X