బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab: హిజాబ్ తియ్యాలని చెప్పే హక్కు అమ్మానాన్నలకే లేదు, మీ నెత్తి మీద కుర్చుకుంటున్నామా, ఫైర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముస్లీం అమ్మాయిలు ఆందోళనకు దిగారు. హిజాబ్ లేకుండా మేము క్లాస్ రూమ్ లో అడుగు పెట్టమని కొందరు ముస్లీం అమ్మాయిలు తేల్చి చెప్పారు. హిజాబ్ తీసేయ్యాలని చెప్పడానికి మా తల్లిదండ్రులకే హక్కు లేదని, హిజాబ్ లు తీసేసి స్కూల్ కు, కాలేజ్ కు రావాలని అని చెప్పడానికి వీళ్లే ఎవరు ? అని మండిపడుతున్నారు. మేము హిజాబ్ వేసుకుని కుర్చీలు, టేబుల్స్ మీద కుర్చుకుంటున్నామని, వాళ్ల నెత్తి మీద కుర్చోవడం లేదని ముస్లీం అమ్మాయిలు మండిపడుతున్నారు. కావాలంటే పరీక్షలు రాయకుండా ఇంట్లో కుర్చుంటామని, హిజాబ్ లు తీసే ప్రసక్తే లేదని ముస్లీం అమ్మాయిలు పరీక్షలు బహిష్కరించడం హాట్ టాపిక్ అయ్యింది. మరో వైపు బుధవారం కాలేజ లు ప్రారంభం కానున్న సందర్బంగా కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ కాలేజ్ లు, విద్యాసంస్థల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Recommended Video

Hijab Row: Lok Sabha నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు..| Oneindia Telugu

Actress: ప్రముఖ నటి సోదరుడి భార్య, అన్న ఒకేసారి ఆత్మహత్య, ఇంట్లో అన్నీఅమ్మేయండి, డెత్ నోట్ !Actress: ప్రముఖ నటి సోదరుడి భార్య, అన్న ఒకేసారి ఆత్మహత్య, ఇంట్లో అన్నీఅమ్మేయండి, డెత్ నోట్ !

 హిజాబ్ లేకుండా క్లాస్ లోకి అడుగు పెట్టము

హిజాబ్ లేకుండా క్లాస్ లోకి అడుగు పెట్టము


కర్ణాటక వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముస్లీం అమ్మాయిలు ఆందోళనకు దిగారు. హిజాబ్ లేకుండా మేము క్లాస్ రూమ్ లో అడుగు పెట్టమని కొందరు ముస్లీం అమ్మాయిలు తేల్చి చెప్పారు. హిజాబ్ లు వేసుకునే మేము విద్యాసంస్థల్లో అడుగు పెడుతామని, హిందువులు నుదుటి మీద బొట్టు పెట్టుకుంటే మేము ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు ఎందుకు మా హిజాబ్ విషయంలో వీళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కొందరు ముస్లీం అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు.

 అమ్మానాన్నలకే హక్కులేదు, వీళ్లు ఎవరు ?

అమ్మానాన్నలకే హక్కులేదు, వీళ్లు ఎవరు ?

హిజాబ్ తీసేయ్యాలని చెప్పడానికి మా తల్లిదండ్రులకే హక్కు లేదని, హిజాబ్ లు తీసేసి స్కూల్ కు, కాలేజ్ కు రావాలని అని చెప్పడానికి వీళ్లే ఎవరు ?, మేము వేరే మతానికి వ్యతిరేకం కాదని, మా హక్కుల కోసం పోరాడుతున్నామని మంగళవారం మద్యాహ్నం కొందరు ముస్లీం అమ్మాయిలు మీడియా ముందు మండిపడ్డారు.

వాళ్ల నెత్తిమీద కుర్చుంటున్నామా ?

వాళ్ల నెత్తిమీద కుర్చుంటున్నామా ?


మేము హిజాబ్ వేసుకుని కుర్చీలు, టేబుల్స్ మీద కుర్చుకుంటున్నామని, వాళ్ల నెత్తి మీద కుర్చోవడం లేదని ముస్లీం అమ్మాయిలు మండిపడుతున్నారు. కావాలంటే పరీక్షలు రాయకుండా ఇంట్లో కుర్చుంటామని, హిజాబ్ లు తీసే ప్రసక్తే లేదని ముస్లీం అమ్మాయిలు పరీక్షలు బహిష్కరించడం హాట్ టాపిక్ అయ్యింది.

పరీక్షలు బహిష్కరణ

పరీక్షలు బహిష్కరణ

హిజాబ్ లు వేసుకున్న కొందరు ముస్లీం అమ్మాయిలు పరీక్షలు రాయడానికి వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు హిజాబ్ లు వేసుకుని రాకూడదని విద్యాశాఖ అధికారులు, పోలీసులు చెప్పారు. ఆ సమయంలో విద్యాశాఖా అధికారులు, పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు లేనిదే మేము పరీక్షలు రాయలేమని చెప్పారు. చివరికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కొందరు ముస్లీం అమ్మాయిలు పరీక్షలు రాయకుండానే ఇంటికి వెళ్లిపోయారు.

ప్రభుత్వం ఆలోచించాలి

ప్రభుత్వం ఆలోచించాలి

కర్ణాటకలోని ఉడిపి, శివమొగ్గతో పాటు అనేక జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. యూనీఫామ్ విషయంలో ప్రభుత్వం వారి నియమాలను సడలించాలని కొన్ని ప్రాంతాల్లోని ముస్లీం అమ్మాయిల కుటుంబ సభ్యులు కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు.

English summary
Hijab Row: Students from Shivamogga govt school boycott exams & decide to go back home after they were refused entry into campus wearing Hijab. Karnataka High Court adjourns Hijab hearing for Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X