బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab: మాకు అన్యాయం జరిగిందని అర్దరాత్రి గోడల మీద రాసేశారు, హిజాబ్ మా హక్కు అని నినాదాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ఉడిపి: ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం (మార్చి 15వ తేదీ) ఉదయం హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉడిపి ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. వచ్చే వారం సుప్రీం కోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో హిజాబ్ వేసుకోవడం మా హక్కు, మాకు అన్యాయం జరిగింది అంటూ కొందరు ఉడిపి జిల్లాలోని గోడల మీద రాతలు రాయడం కలకలం రేపింది. కర్ణాటక బంద్ కు ముస్లీం సంఘాలు పిలుపు ఇచ్చిన రోజే హిజాబ్ కు మద్దతుగా కొందరు గోడల మీద రాతలు రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

RRR: ఎవరి ఊహలు వాళ్లవే, వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, చరిత్రలో నిలిచిపోతుంది, నో డౌట్!RRR: ఎవరి ఊహలు వాళ్లవే, వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, చరిత్రలో నిలిచిపోతుంది, నో డౌట్!

 ఎక్కడ మొదలైయ్యిందో మళ్లీ అక్కడే ?

ఎక్కడ మొదలైయ్యిందో మళ్లీ అక్కడే ?

ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు మమ్మల్ని అడ్డుకున్నారని కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు ఆరోపించారు. ఉడిపి జిల్లాలో హిజాబ్ వివాదం మొదలు కావడంతో కర్ణాటక వ్యాప్తంగా రచ్చరచ్చ అయ్యింది. హిజాబ్ వివావాదం రాజకీయరంగు పులుముకోవడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

 హైకోర్టులో పిటిషన్లు

హైకోర్టులో పిటిషన్లు

ఉడిపి జిల్లా కాలేజ్ ప్రిన్సిపాల్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం (మార్చి 15వ తేదీ) ఉదయం హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.

 సుప్రీం కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు

సుప్రీం కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉడిపి ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. కర్ణాటక హైకోర్టులో మాకు అన్యాయం జరిగిందని, అందుకే మేము సుప్రీం కోర్టును ఆశ్రయించామని ఉడిపికి చెందిన కొందరు ముస్లీం అమ్మాయిలు అంటున్నారు. వచ్చే వారం సుప్రీం కోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

 హిజాబ్ కు మద్దతుగా గోడల మీద పెయింట్ తో ఎవరు రాశారు ?

హిజాబ్ కు మద్దతుగా గోడల మీద పెయింట్ తో ఎవరు రాశారు ?

హిజాబ్ వేసుకోవడం మా హక్కు, మాకు అన్యాయం జరిగింది అంటూ కొందరు ఉడిపి జిల్లాలోని గోడల మీద రాతలు రాయడం కలకలం రేపింది. కర్ణాటక బంద్ కు ముస్లీం సంఘాలు పిలుపు ఇచ్చిన రోజే హిజాబ్ కు మద్దతుగా కొందరు గోడల మీద రాతలు రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అర్దరాత్రి దాటిన తరువాత ఓ వర్గం వాళ్లు గోడల మీద హిజాబ్ కు మద్దతుగా రాతలు రాశారని, ఎవరు రాశారో తెలీయడం లేదని స్థానిక పోలీసులు అంటున్నారు. ఉదయం నిద్రలేచిన స్థానికులు హిజాబ్ కు మద్దతుగా గోడల మీద రాతలు ఉన్న విషయం గుర్తించి గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజాబ్ వివాదం కారణంగా ఉడిపి జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది.

English summary
Hijab verdict: Provocative message found in Udupi in Karnataka about Hijab Row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X