Hijab verdict: హిజాబ్ ఇస్లాంలో భాగం కాదు, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, యూనీఫామ్ మాత్రమే!
బెంగళూరు: హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థలో అడుగు పెట్టకూడదని ఉడిపిలో కాలేజ్ ప్రిన్సిపాల్ తీసుకున్న నిర్ణయంపై కర్ణటకతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
Recommended Video
హిజాబ్ లు, కాషాయకండువాలు వేసుకుని విద్యాసంస్థల్లో అడుగుపెట్టకూడదని ఇటీవల కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఇంతకాలం విద్యాశాఖ అధికారులు స్కూల్స్, కాలేజ్ ల్లో అమలు చేశారు. మంగళవారం ఉదయం హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ విషయంలో కర్ణాటక ఇచ్చిన తీర్పు కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

ఇస్లాంలో హిజాబ్ భాగం కాదు
హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లో వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికదాని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్ లు వేసుకోవాలని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రభుత్వఆదేశాలు కచ్చితంగా పాటించాలి
హిజాబ్ లు వేసుకునే విషయం పట్టుబట్టి హైకోర్టును ఆశ్రయించిన అమ్మాయిలకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వం సూచించిన యూనీఫామ్ వేసుకుని విద్యాసంస్థలకు వెళ్లాలని, హిజాబ్ లు, కాషాయకండవాలతో పాటు మతపరమైన దస్తులు దరించి విద్యాసంస్థల్లో అడుగుపెట్టడానికి అవకాశం లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

ఆదేశాలు కచ్చితంగా పాటించాలి
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని, ప్రతి విద్యార్థి పాటించాలని, శాంతిని కాపాడాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ప్రజలకు మనవి చేశారు. కర్ణాటక హైకోర్టు హిజాబ్ విషయంలో ఇచ్చిన తీర్పు తరువాత సీఎం బసవరాజ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు చదువు ముఖ్యమని, హిజాబ్ లు, కాషాయకండువాలు కాదని, ఆ విషయం ప్రతిఒక్క విద్యార్థి గుర్తు పెట్టుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ మనవి చేశారు.
హిజాబ్ లు వేసుకుని కాలేజ్ లు వెలుతామని ఇకనైనా మొండిపట్టు వదిలేయాలని పలువురు హిందూ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని విద్యాశాఖ అధికారులు మనవి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications