షాకింగ్: బీజేపీ ఎంపీ ఆత్మహత్య - ఢిల్లీలోని ఇంట్లో వేలాడుతూ హిమాచల్ నేత -పార్లమెంటరీ భేటీ వాయిదా

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న సందడి వాతావరణం కాస్తా విషాదంగా మారిందిప్పుడు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన బీజేపీకి చెందిన ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలోని తన నివాసం అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న రామ్ స్వరూప్ శర్మ(62) ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం ఉదయం విగత జీవిగా కనిపించారు. తన గదిలోని సీలింగ్ కు ఉరి పెట్టుకుని కనిపించడంతో ఆయనది ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగానే దర్యాప్తు చేస్తారని తెలుస్తోంది.

Himachal BJP MP Ram Swaroop Sharma Found Dead At Delhi Residence, Party meet cancelled

మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన రామ్ స్వరూప్ కు వివాదరహితుడిగా పేరుంది. పార్లమెంట్ సమావేశల్లో పాల్గొనేందుకే ఢిల్లీకి వచ్చిన ఆయన ఇలా అనుమానాస్పద స్థితిలో మరణించడం చర్చనీయాంశమైంది. ఎంపీ ఆకస్మిక మరణంతో బీజేపీ బుధవారం తలపెట్టిన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని వాయిదా వేసింది. కాగా,

Himachal BJP MP Ram Swaroop Sharma Found Dead At Delhi Residence, Party meet cancelled

గత నెలలో దాదాపు ఇదే రీతిగా దాద్రా నగర్ హవేలీ లోక్ సభ ఎంపీ మోహన్ దేల్కర్ ముంబైలోని ఓ హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతిపై బీజేపీ, శివసేనల మధ్య విమర్శ, ప్రతివిమర్శలు కూడా సాగాయి. బీజేపీ కుట్రలవల్లే స్వతంత్ర ఎంపీ దేల్కర్ బలయ్యారని మహా సర్కార్ ఆరోపించింది. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+