ఘోర ప్రమాదం: సిమ్లాలో బస్సు నదిలో పడి 44 మంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందారు.

56 మంది ప్రయాణీకులతో ఉత్తరాఖండ్‌లోని తియునీ ప్రాంతానికి వెళ్తున్న బస్సు సిమ్లాలోని నేర్వా ప్రాంతంలో అదుపు తప్పి టాన్స్ నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.

సమాచారమందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 44 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As many as 44 people were dead after a bus fell into Tons river in Shimla district of Himachal Pradesh.
Please Wait while comments are loading...