వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో : ఇళ్లకు ఉచిత విద్యుత్, సీపీఎస్ రద్దు సహా కీలక హామీలు

|
Google Oneindia TeluguNews

ఈ నెల 12న జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇవాళ మ్యానిఫెస్టో విడుదల చేసింది.
ఇందులో ఉచిత విద్యుత్ సహా పలు కీలక హామీలున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించి అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పలు కీలక హామీలిచ్చింది.

ఇవాళ ప్రకటించిన మ్యానిఫెస్టోలో పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని, లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానం స్ధానంలో పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

 Himachal Pradesh Assembly elections 2022: Congress promises free power, 1500 pm to women

రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి గ్రామంలో మొబైల్ క్లినిక్‌లు ప్రారంభిస్తామని కూడా హామీ ఇచ్చింది. యువత కోసం స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేసి ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10కోట్లు కేటాయిస్తామని కూడా తెలిపింది. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం కొత్త టూరిజం పాలసీని రూపొందిస్తామని, గ్రామాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 'స్మార్ట్ విలేజ్' ప్రాజెక్టును ప్రారంభిస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది.

బీజేపీలా తాము హామీలిచ్చి వాటిని తప్పబోమని, కచ్చితంగా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కేబినెట్ తొలి సమావేశంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులు కూడా భర్తీ చేస్తామన్నారు. వృద్ధాప్య పింఛను మొత్తాల్సి సైతం పెంచనున్నట్లు కాంగ్రెస్ మ్యానిఫెస్టో తెలిపింది. 75 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక సామాజిక భద్రత పింఛను ఇస్తామని వెల్లడించింది.

English summary
congress party has released manifesto for upcoming himachal pradesh assembly elections today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X