హిమాచల్‌ప్రదేశ్‌లో వాహనాలపై పడ్డ కొండచరియలు, 50 మంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

మండి: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ప్రాంతంలో కొండచరియలు హైవేపై వెళ్తున్న వాహనాలపై విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయారని సమాచారం. అయితే ఇప్పటికే 7 మృతదేహలను వెలికితీశారు. సహయక చర్యలను కొనసాగుతున్నాయి.

21వ, నెంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న రెండు బస్సులు, ఓ కారుపై కొండచరియలు శనివారం రాత్రి విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 21వ, నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

Himachal Pradesh: At least 50 feared dead after landslide sweeps away two buses in Mandi

కొండచరియలు పడడంతో మూడు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కాగా మరో బస్సు లోయలో పడింది. శిథిలాల కింద చిక్కుకొన్న నలుగురిని సహయక సిబ్బంది సురక్షితంగా రక్షించారు.

UP Dangal Modi Pongal : Modi Magic In Uttar Pradesh - Oneindia Telugu

వర్షం పడుతుండడంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. రహదారిపై పడిన కొండరాళ్ళను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Over 50 passengers are feared dead after two Himachal Pradesh Road Transport Corporation buses were swept away by a landslide in Mandi district. The incident happened a little after midnight on the National Highway connecting Manali and Mandi.
Please Wait while comments are loading...