బిగ్ షాక్: డీజిల్‌పై పన్ను పెంపు- లీటర్‌పై రూ.3 ఎక్స్‌ట్రా బాదుడు
సిమ్లా: వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వంద రూపాయలు దాటిన పెట్రోల్, ఆ మార్క్ కు కాస్త అటు ఇటుగా ఉంటోన్న డీజిల్ రేట్లతో సతమతమౌతోన్న వారిపై ఎక్స్‌ట్రా భారాన్ని మోపింది. డీజిల్‌పై మూడు రూపాయల మేర విలువ ఆధారిత పన్నును పెంచింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. పెట్రోల్‌పై మాత్రం ఊరట కల్పించింది. దీనిపై వసూలు చేస్తోన్న వ్యాట్ మొత్తాన్ని 55 పైసల మేర తగ్గించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను జారీ చేసింది.

రూ.3 భారం..
ప్రస్తుతం డీజిల్‌పై లీటర్ ఒక్కింటికి ఆరు శాతం మేర వ్యాట్ ను వసూలు చేస్తోంది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. దీని విలువ 4.40 రూపాయలు. కాగా- ఈ విలువ ఆధారిత పన్నును ఆరు నుంచి 9.96 శాతానికి పెంచింది. అదనంగా 3.96 శాతం మేర వ్యాట్ భారాన్ని మోపింది. దీని విలువ 3 రూపాయలు. ఫలితంగా డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రూ. 4.40 పైసల నుంచి రూ.7.40 పైసలకు పెరిగింది. పెంచిన వ్యాట్ ఇవ్వాళ్టి నంచే అమల్లోకి వచ్చింది.

ఢిల్లీలో ఇలా..
కాగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

విశాఖలో..
కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.

హైదరాబాద్ లో..
అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.

మహారాష్ట్ర మాత్రమే..
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండుసార్లు వ్యాట్‌ను తగ్గించింది.
-
నానాటికీ తగ్గుతున్న పెట్రోల్ `మార్జిన్లు` -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications