viral video: అత్యంత భయానకంగా -కొండచరియలు పడి భారీగా టూరిస్టుల దుర్మరణం, మోదీ సంతాపం

కరోనా విలయం నుంచి మెల్లగా తేరుకుంటోన్న జనం సరదాగా కొండ ప్రాంతాల్లో పర్యటనకు వెళుతున్నారు. కానీ భారీ వర్షాలు, అనూహ్యంగా మారుతోన్న వాతావరణం వారి పాలిట శాపంగా పరిణమించింది. జనసమర్థం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు భారీగా ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. వివరాలివి..

ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం ఘోర దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్కడి టూరిస్టు కేంద్రమైన కిన్నౌర్ జిల్లాలోని సంగాల్ లోయలో పలు చోట్ కొండచరియలు విరిగిపడ్డాయి. ఆదివారం కావడంతో ఆ మార్గంలో పర్యాటకుల వాహనాలు భారీగా కొలువుదీరిన సమయంలోనే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి..

Himachal Pradesh landslide video: At least 9 tourists killed, bridge collapse, pm modi grief

వందల అడుగుల ఎత్తు నుంచి పెద్ద పెద్ద రాళ్లు బంతుల మాదిరిగా దొర్లుకుంటూ వచ్చి రోడ్డుపైనున్న వాహనాలపై పడ్డాయి. సంగాల్ లోయలో కీలకమైన వంతెనపై రాళ్లు పడటంతో అది ఒక్కసారిగా ధ్వంసమైపోయింది. పదుల సంఖ్యలో వాహనాలు, పర్యాటకుల విశ్రాంతి గదులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ భయానక దృశ్యాల తాలూకు వీడియో ప్రస్తుతం వైరలైంది.

హిమాచల్ ప్రదేశ్ కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది పర్యాటకులు చనిపోయారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ఆ రాష్ట్ర మంత్రి జైరాం ఠాకూర్ తెలిపారు. చనిపోయిన ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఐటీబీపీ జవాన్ల బృందాలు తరలివెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి.

కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడి టూరిస్టులు చనిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి ద్వారా మరణించిన వారి కుటుంబీకులకు రూ.2లక్షల చొప్పున, గాయపడినవారిని రూ.50 వేల చోప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తామని పీఎంవో ఒక ప్రకటన చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+