ఒమిక్రాన్ టెర్రర్: హిమాచల్, మధ్యప్రదేశ్‌లో కేసులు వెలుగులోకి.. దేశంలో 422కి చేరిన సంఖ్య
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వణికిస్తోంది. కేసులు దేశాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. భారత్‌లో కూడా రాష్ట్రాలకు పాకతున్నాయి. ఇవాళ హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఒమిక్రాన్ కేసు వెలుగుచూశాయి. తొలుత ఎంపీ నైట్ కర్ఫ్యూ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ కూడా కేసు వచ్చింది. ఒక్కరోజే సింగిల్ డిజిట్ వచ్చింది. కేసులు పెరుగుతున్నందున.. 31, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సందర్భంగా ఆంక్షలు ఉంటాయి. గుంపులు గుంపులుగా జనం ఉండొద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంచేశాయి.
కెనడా నుంచి వచ్చిన మహిళకు హిమాచల్ ప్రదేశ్‌లో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. 10 మంది నమూనాలను జినొమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా.. ఒకరికి పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. సదరు మహిళ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని వివరించారు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో కేసులు వచ్చాయి. దేశంలో ఇప్పటివరకు 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.

ఇటు మధ్యప్రదేశ్‌లో కూడా కేసులు వచ్చాయి. ఇవాళ 8 కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఆరుగురు ఇంటి వద్ద హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో ఉన్నారని మధ్యప్రదేశ్ హోం మంత్రి నారొత్తం మిశ్రా తెలిపారు. ఒడిశాలో 4 కేసులు వచ్చాయి. కర్ణాటకలో 7 కేసులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో 4 కేసులు వచ్చాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422కి చేరుకుంది. రోజుకు 50కి పైగా కేసులు వస్తున్నాయి. తమిళనాడు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ రిపోర్ట్ చూపించాలని ఆ రాష్ట్రం స్పష్టంచేసింది.
ఇటు ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాత్రి కర్ఫ్యూ విధించాయి. అన్నీ రాష్ట్రాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించాయి. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది.












Click it and Unblock the Notifications