హిందువులంటే బీజేపీ కాదు... ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ జోషీ ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీని వ్యతిరేకించినంత మాత్రాన హిందువులను వ్యతిరేకించినట్టు కాదని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషీ అన్నారు. హిందువులంటే భారతీయ జనతా పార్టీ కాదని,కాబట్టి ఆ పార్టీతో విభేదించడాన్ని హిందు కమ్యూనిటీకి ఆపాదించలేమని వ్యాఖ్యానించారు. రాజకీయ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని,కానీ దాన్ని హిందువులకు ముడిపెట్టి చూడలేమని అన్నారు. గోవాలని డోనా పౌలాలో జరిగిన ఓ కార్యక్రమంలో భయ్యాజీ మాట్లాడారు.

భారత్‌లో పనిచేయాలనుకునే ఎవరైనా.. ఇక్కడి హిందువులతో కలిసి పనిచేస్తూ.. వారి సాధికారత కోసం కృషి చేయాల్సి ఉంటుందన్నారు.చరితగ్రతిలో హిందువులు ఎన్నో ఉత్థాన పతనాలు చవిచూశారని గుర్తుచేశారు. భారత్‌ను హిందూ సమాజం నుంచి విడదీసి చూడలేమని.. ఈ దేశంలో ఎప్పటికీ హిందువులదే కీలక స్థానమని చెప్పారు.

Hindu community does not mean Bharatiya Janata Party says bhaiyyaji joshi

2020లో భారత్ సూపర్ పవర్‌గా అవతరించబోతుందని ప్రపంచమంతా చెబుతోందని భయ్యాజీ అన్నారు. కానీ ఓ మేధావి తనతో అన్న మాటలు గుర్తున్నాయని... భారత్ 2020లో గొప్ప దేశంగా అవతరించాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన చెప్పారని అన్నారు. హిందువులు ఎప్పుడూ ఇతర దేశాలపై దాడి చేయలేదని జోషి గుర్తుచేశారు. ఏ యుద్ధం చేసినా.. ఆత్మరక్షణ కోసమేనని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ హక్కు ఉందన్నారు.

ప్రపంచానికి సమన్వయ మార్గాన్ని బోధించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందన్నారు. భారత్,హిందువులు తప్ప ఈ పనిని మరొకరు నిర్వర్తించలేరని అభిప్రాయపడ్డారు. అంతకుముందు పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి మాట్లాడిన ఆయన.. కేంద్రం ఆ చట్టాన్ని ఆమోదించిందన్నారు. రాజ్యాంగానికి లోబడి ఆ చట్టాన్ని ప్రభుత్వం అమలుచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్రం చేసిన చట్టాలను తిరస్కరించే హక్కు రాష్ట్రాలకు లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+