వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశాన్ని పరిపాలిస్తోన్నది నరేంద్ర మోదీ కాదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధానికి సమీపించింది. ఈ ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్‌లో యాత్రను పునఃప్రారంభించిన ఆయన సాయంత్రానికి దేశ రాజధానికి చేరుకుంది. బహదూర్ బోర్డర్ మీదుగా ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద ఈ భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, హర్యానా మీదుగా ఢిల్లీ చేరింది. జమ్మూ కాశ్మీర్‌లో ఇది ముగియాల్సి ఉంది.

జోష్‌లో..

జోష్‌లో..

ఈ తెల్లవారు జామున ఆయన హర్యానాలోని ఫరీదాబాద్‌లో యాత్రను పునఃప్రారంభించారు. ఢిల్లీకి సమీపిస్తోన్న కొద్దీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటోన్న ప్రముఖల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాహుల్ గాంధీ తల్లి, ఏఐసీసీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇవ్వాళ రాహుల్ గాంధీని కలిశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

సౌత్ నుంచి ..

ఈ పరిస్థితుల మధ్య భారత్ జోడో యాత్రలో లోక నాయకుడు, మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కమల్ హాసన్.. రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. దేశ రాజకీయ స్థితిగతులపై చర్చించారు. అనంతరం భోజన విరామం అనంతరం పునఃప్రారంభమైన భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.

కీలక ప్రసంగం..

ఢిల్లీ చేరుకున్న అనంతరం రెడ్ ఫోర్ట్ వద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. దేశ పరిపాలన చేతులు మారిందని మండిపడ్డారు.

లక్ష్యం అదే..

లక్ష్యం అదే..


భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని రాహుల్ గాంధీ వివరించారు. దేశాన్ని ఏకం చేయడమే యాత్ర ఉద్దేశమని, ప్రజల్లో నెలకొన్న ద్వేష భావాన్ని తుడిచివేయాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ దేశంలో ద్వేషం అన్ని చోట్లా ఉందని పేర్కొన్నారు. హిందూ - ముస్లిం ద్వేష భావం వ్యాప్తి చెందుతోందనడం సరికాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ దేశం ఒక్కటేనని, తాను పాదయాత్ర సందర్భంగా లక్షల మందిని కలిశానని, వారందరూ ఒకరంటే ఒకరికి గౌరవభావం ఉందని తేల్చి చెప్పారు. వారి మధ్య చిచ్చుపెట్టడానికి, ధ్వేషభావాన్ని చెలరేగేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

దృష్టి మరల్చడానికే..

దృష్టి మరల్చడానికే..

మన చుట్టూ మతాలకు అతీతంగా ప్రార్థన మందిరాలు నిర్మితం అయ్యాయని, అదే అసలైన భారత్ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జైన మందిరం, గురుద్వారా, ఎన్నో ఆలయాలు, మసీదులు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజల దృష్టిని మరల్చడానికే హిందూ-ముస్లిం విద్వేషాలను వ్యాప్తి చేస్తోన్నారని ధ్వజమెత్తారు. పిక్‌పాకెట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఎవరైనా మన జేబులు కొట్టేస్తోన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటే వారు మొదట చేసేది మన దృష్టిని మరల్చడమేనని, హిందూ- ముస్లిం పేరుతో ఇప్పుడదే జరుగుతోందని అన్నారు.

 పాలిస్తోంది వారిద్దరే..

పాలిస్తోంది వారిద్దరే..

ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం కాదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. అంబానీ-అదానీ ద్వయం ప్రభుత్వాన్ని పాలిస్తోందంటూ ఆరోపించారు. దేశం ఎప్పుడో వారిద్దరి చేతుల్లోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ పరిస్థితులపై రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇన్ని సంవత్సరాలు చదివి డిగ్రీలు పొందిన యువతీ యువకులు ఇప్పుడు పకోడీలను అమ్ముకుంటోన్నారని చెప్పుకొచ్చారు.

English summary
Congress MP Rahul Gandhi lashes out PM Narendra Modi government and said that the Hindu-Muslim is being done to divert attention from the real issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X