బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందూ, ముస్లీం దంపతులు, బెంగళూరులో ఇంటర్వూ: హోటల్ లో రూం ఇవ్వం, చివరికి !

హిందూ, ముస్లీం దంపతులకు ప్రముఖ హోటల్ లో గది ఇవ్వడానికి నిరాకరించిన ఘటన ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో జరిగింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిందూ, ముస్లీం దంపతులకు ప్రముఖ హోటల్ లో గది ఇవ్వడానికి నిరాకరించిన ఘటన ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో జరిగింది. కేరళకు చెందిన హిందూ, ముస్లీం దంపతులకు ససేమిరా రూం ఇవ్వమని తేల్చి చెప్పారు.

<strong>రూ. వేల కోట్ల కాంట్రాక్టు: బినామీ కంపెనీ పేరుతో కాంగ్రాస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేకి?</strong>రూ. వేల కోట్ల కాంట్రాక్టు: బినామీ కంపెనీ పేరుతో కాంగ్రాస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేకి?

ఈ విషయంపై కేరళకు చెందిన షఫీక్ సుబైదా హకీం, దివ్యా దంపతులు విచారం వ్యక్తం చేస్తూ తమకు పరిచయం ఉన్న వారి ఇంటిలో తలదాచుకుని బెంగళూరులో వారి పని ముగించుకుని మళ్లీ కేరళ వెళ్లారని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.

హిందూ, ముస్లీంల ప్రేమ వివాహం

హిందూ, ముస్లీంల ప్రేమ వివాహం

కేరళకు చెందిన షఫీక్ సుబైదా హకీం, దివ్యా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ చట్టం ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పనిమీద సోమవారం దంపతులు ఇద్దరూ బెంగళూరు చేరుకుని ఓ హోటల్ లో బస చెయ్యాలని నిర్ణయించారు.

రిజిస్టర్ లో పేరు నమోదు చేసి !

రిజిస్టర్ లో పేరు నమోదు చేసి !

బెంగళూరు చేరుకున్న షఫీక్ సుబైదా హకీం, దివ్యా దంపతులు ఇక్కడి సుధామనగరలోని మణ్ణిపురం మెయిన్ రోడ్డులోని ఆలివ్ రెసిడెన్సీ హోటల్ లోకి వెళ్లారు. తరువాత షఫీక్ సుబైదా హకీం హోటల్ లో రూం కావాలని సిబ్బందికి చెప్పాడంతో రిజిస్టర్ లో ఆయన పేరు రాసుకున్నారు.

భార్య పేరు విని షాక్ గురై !

భార్య పేరు విని షాక్ గురై !

హోటల్ లోని రిసెఫ్షన్ కౌంటర్ లోని బుక్ లో షఫీక్ సుబైదా హకీం పేరు రాసుకున్న తరువాత ఆయన తన భార్య పేరు దివ్యా అని చెప్పారు. అంతే హోటల్ సిబ్బంది షాక్ కు గురైనారని సమాచారం. ఐడీ కార్డులు చూపించి మేము ఇద్దరం దంపతులు అని వారికి చెప్పారు.

ఒకే రూంలో రెండు మతాల వారు ?

ఒకే రూంలో రెండు మతాల వారు ?

దంపతులు ఇద్దరు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులు చూపించినా హోటల్ సిబ్బంది మాత్రం వారిని నమ్మలేదు. ఒకే గదిలో హిందూ, ముస్లీం మతాలకు చెందిన వారు ఎలా ఉంటారు ? అని దంపతులను ప్రశ్నించారు. ఈ హోటల్ లోరూం ఇవ్వమంటే ఇవ్వమని తేల్చి చెప్పారు.

రెండు మతాలు అయితే ఏం ?

రెండు మతాలు అయితే ఏం ?

రెండు మతాలకు చెందిన మేము పెళ్లి చేసుకున్నాం, మతాలు వేరు అయితే ఒకే గదిలో ఉండటానికి మీకు ఏమిటి అభ్యంతరం అంటూ షఫీక్ అక్కడి సిబ్బందిపై మండిపడ్డారు. ఓ ఇంటర్వూ కోసం బెంగళూరు వచ్చిన మేము హోటల్ ఉండటానికి రూం ఇవ్వడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారని షఫీక్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయ్యారు.

ఇంటర్వూ ఉంది, టైం లేదని !

ఇంటర్వూ ఉంది, టైం లేదని !

ఇంటర్వూ ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి సమయం లేకపోవడంతో షఫీక్ ఓ ఆంగ్ల దినపత్రికి పూర్తి సమాచారం ఇచ్చారు. ఆంగ్ల దినపత్రిక రిపోర్టర్ హోటల్ కు వెళ్లి విచారణ చెయ్యగా అవును హిందూ, ముస్లీం దంపతులకు హోటల్ లో రూం ఇవ్వమని చెప్పామని ధీమాగా సమాధానం ఇచ్చారని ఆ పత్రిక వార్త ప్రచురించింది.

ఆత్మహత్య చేసుకుంటే ?

ఆత్మహత్య చేసుకుంటే ?

కేరళకు చెందిన హిందూ, ముస్లీం దంపతులు తక్కువ లగేజ్ తో ఇక్కడికి వచ్చారని, వారు గదిలో ఆత్మహత్య చేసుకుంటే మాకు లేనిపోని పోలీసు కేసుల సమస్య వస్తుందని, ముఖ్యంగా నేను పూర్తిగా పల్లెటూరిలో పెరిగానని, అక్కడ ఇలా హిందూ, ముస్లీం కులాల వారు పెళ్లి చేసుకోరని హోటల్ లో రూం ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తి సమాధానం ఇచ్చాడని ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. మొత్తం మీద లక్షల మంది విద్యావంతులు ఉన్న బెంగళూరులో కేరళకు చెందిన దంపతులకు హోటల్ లో రూం ఇవ్వడానికి నిరాకరించడం కొసమెరుపు.

English summary
Shafeek Subaida Hakkim and Divya DV, a married couple from Kerala who were in Bengaluru for some work, were refused a room at Olive Residency on Annipuram Main Road in Sudhama Nagar because he’s a Muslim and she’s a Hindu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X