‘బలిదాన్ దివస్’గా గాడ్సే వర్ధంతి: హిందూ మహాసభ
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథురాంగాడ్సేను అమరుడిగా కీర్తించేందుకు హిందూ మహాసభ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
గాడ్సే వర్ధంతి సందర్భంగా నవంబర్ 15న దేశంలోని అన్ని రాష్ర్టాల్లో జిల్లాస్థాయిలో ‘బలిదాన్ దివస్'ను నిర్వహించాలని ఆల్ ఇండియా హిందూ మహాసభ చంద్రప్రకాశ్ కౌశిక్ తన సంస్థ కార్యకర్తలకు సోమవారం పిలుపునిచ్చారు.

రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని, గాడ్సేపై అతని తమ్ముడు గోపాల్ గాడ్సే రాసిన పుస్తకాలను పంచిపెట్టాలని సూచించారు. గాడ్సే దేశభక్తుడా, దేశద్రోహినా అన్న అంశంపై చర్చలు కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తాన్ని సైనికులకు ఉపయోగించేందుకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications