Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట అద్భుత ఘట్టం: సంతోషం మాటల్లో చెప్పలేనన్న ప్రధాని మోడీ!!

500 ఏళ్ల నాటికల ఇప్పుడు సాకారమైంది అయోధ్యలోని రామ మందిరంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది . రాముని జన్మస్థలం లో 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామయ్య కొలువు తీరారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన చారిత్రాత్మక ఘట్టం పూర్తయ్యింది. అయోధ్య గర్బాలయంలో బాలరాముడికి ప్రధాని తొలిపూజ చేసి.. దర్శించుకున్నారు.

మోదీతో పండితులు పూజలు చేయించారు. సరిగ్గా 12.29 గంటలకు ప్రారంభమైన ప్రతిష్ఠ 84 సెకెన్ల పాటు జరిగింది. అభిజిత్ లగ్నంలో ఈ క్రతువు నిర్వహించారు. ఈ మహా క్రతువు కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలోని 121 మంది వేద పండితులు, రుత్విజుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ శుభ సందర్భాన అయోధ్య నగరమంతా రామనామ స్మరణతో మార్మోగిపోయింది.

 historic event ayodhya ram pran pratishtha completed: Prime Minister Modi emotional tweet!!

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. అయోధ్యలోని రామ మందిరంలోకి ఆయన వెళుతున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన గుడి లోపలికి మెల్లగా నడుస్తూ రామునికి నైవేద్యాలను తీసుకువెళ్ళిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా ఈ దైవిక కార్యక్రమంలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీ రామ్ లల్లా జీవితానికి అంకితం చేయబడిన అతీంద్రియ క్షణం ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ దివ్య కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్య‌మైనందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ జై శ్రీరామ్ అంటూ పోస్ట్ చేశారు. మాటల్లో చెప్పలేనంత సంతోషం ఈరోజు కలిగిందని ఆయన తన పోస్టు ద్వారా పేర్కొన్నారు.

ఈ రోజు శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న భారతదేశ ప్రధాని మోడీ ఈ నెల 12వ తేదీ నుండే శ్రీరామ ఉపాసన చేస్తున్నారు. యమ నియమాలని పాటిస్తూ రామునికి మనసును అంకితం చేసి కఠోర నియమాలను ఆచరిస్తున్నారు. అనేక పుణ్య క్షేత్రాలలో రామయ్యను దర్శిస్తూ తన భక్తిని చాటుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+