కారు అద్దాలు పగలగొట్టి రూ. 5 లక్షలు లూటి
మంగళూరు: ప్రసిద్ది చెందిన జ్యూవెల్లరీ షాప్ ముందు పార్క్ చేసిన కారు అద్దాలు పగలగొట్టిన నిందితులు రూ. ఐదు లక్షలు లూటీ చేసిన సంఘటన మంగళూరు నగరంలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళకు చెందిన అరుణ్ శెట్టి అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళూరు నగరంలో కేఎస్ రావ్ రోడ్డులో ప్రసిద్ది చెందిన జాయ్ లుకాస్ జ్యూవెల్లరీ షాప్ ఉంది. గురువారం అరుణ్ శెట్టి కుటుంబ సభ్యులతో కలిసి బంగారు నగలు కొనుగోలు చెయ్యడానికి ఆ షాప్ దగ్గరకు వెళ్లారు.

కారులో రూ. ఐదు లక్షలు పెట్టి మిగిలిన డబ్బు తీసుకున్నారు. షాప్ ముందు కారు పార్క్ చేసి లోపలికి వెళ్లారు. బంగారు నగలు కొనుగోలు చేసి బయటకు వచ్చి చూడగా కారు వెనుక డోర్ అద్దం పగలగొట్టిన నిందితులు రూ. 5 లక్షలు ఉన్న బ్యాగ్ లూటీ చేశారని గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. జాయ్ లుకాస్ షాప్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. బైక్ లో వచ్చిన ఇద్దరు నిందితులు కారు అద్దాలు పగలగొట్టి నగదు లూటీ చేశారని వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications