ఎన్డీయే కూటమి డొల్లతనం ? 38లో లోక్ సభ సీట్లు గెల్చుకున్న పార్టీలు తొమ్మిదే-మిగతాదంతా..!

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ జాతీయ స్ధాయిలో ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటముల పోరు తప్పడం లేదు. ఓవైపు బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిపి 38 పార్టీల కూటమి ఎన్డీయేగా ఏర్పడగా.. 26 విపక్ష పార్టీలు కలిసి ఇండియా ఏర్పడ్డాయి. ఈ రెండు కూటముల మధ్య వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల పోరు జరగబోతోంది. ఈ నేపథ్యంలో అసలు అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి బలాబలాల్ని ఓసారి చూద్దాం..

తాజాగా ఎన్డీయే ఢిల్లీలో నిర్వహించిన భేటీకి బీజేపీతో పాటు మొత్తం 38 పార్టీలు హాజరయ్యాయి. విపక్ష కూటమిలో 26 పార్టీలు చేరిన వేళ.. వాటి కంటే ఘనంగా ఉందని చెప్పుకునేందుకు చిన్నా చితకా పార్టీల్ని ఎన్డీయే భేటీకి ఆహ్వానించారు. ఈ పార్టీల్లో చాలా మటుకు 2019 ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెల్చుకోని పార్టీలే. 38 పార్టీల్లో కేవలం 8 పార్టీలు మాత్రమే కనీసం ఒక్క సీటు గెల్చుకున్నాయి.

nda1

అలాగే బీజేపీతో పాటు ఎన్సీపీ, శివసేన, లోక్ జన్ శక్తి చీలిక వర్గాలు మినహా మిగిలిన పార్టీలన్నీ నామమాత్రంగానే ఉన్నాయి.బీజేపీ మినహా మిగిలిన 37 పార్టీల్లో 10 పార్టీలు అసలు 2019 ఎన్నికల్లో పోటీయే చేయలేదు. పోటీ చేసిన మిగిలిన 23 పార్టీల్లో కేవలం 8 పార్టీలు మాత్రమే లోక్ సభలో ఖాతా తెరిచాయి. అలాగే ఈ పార్టీలు గెల్చుకున్న సీట్లు కూడా 9 మాత్రమే. అయితే 2 కోట్ల ఓట్లు మాత్రం సాధించాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 37.69% ఓట్లతో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపిన శివసేన షిండే వర్గానికి 18 ఎంపీ సీట్లున్నాయి. అలాగే చిరాగ్ పాశ్వాన్, అతని మామ పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని గ్రూపులుగా విడిపోయిన లోక్ జన్ శక్తి పార్టీ కూడా గత ఎన్నికల్లో ఎన్డీయేలో భాగంగా పోటీ చేసి బీహార్‌లో 8% ఓట్లతో ఆరు సీట్లు గెలుచుకుంది. ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గం కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని మహారాష్ట్రలో 1.39 ఓట్ షేర్‌తో ఐదు సీట్లను గెలుచుకుంది.

nda

మిగిలిన 33 పార్టీలలో 10 పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఇందులో శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), జన్ సురాజ్య శక్తి పార్టీ, కుకీ పీపుల్స్ అలయన్స్, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, నిషాద్ పార్టీ, హర్యానా లోఖిత్ కాంగ్రెస్, పుతి కామరోన్ లోఖిత్ కాంగ్రెస్, కేరళ ఎఫ్ వంటివి ఉన్నాయి. మిగిలిన 23లో 12 రాష్ట్ర స్థాయి పార్టీలు, 11 గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. వీటిలో 8 పార్టీలు ఒక్కో సీటు గెల్చుకున్నాయి. ఈ ఎనిమిది పార్టీల్లో అప్నా దళ్ (సోనీలాల్), ఏజేఎస్యూ, ఏఐఏడీఎంకే, మిజో నేషనల్ ఫ్రంట్, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా ఉన్నాయి.

ఇప్పుడు NDAలో భాగమైన 38 పార్టీలలో 15 పార్టీలు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. ఈ పార్టీలు కలిసి 2019లో దాదాపు 92 లక్షల ఓట్లను సాధించాయి. ఈ 15 పార్టీల్లో ఆల్ ఇండియా ఎన్.ఆర్.కాంగ్రెస్, అసోం గణ పరిషత్, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, పట్టాలి మక్కల్ కట్చి, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ, భారత్ ధర్మ జనసేన, హిందుస్తానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్), జనసేన పార్టీ, జననాయక్ జనతా పార్టీ, ప్రహార్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ సమాజ్ దేవ్ పార్టీ, రిపబ్లికన్ తమిళ్ పార్టీ, కాంగ్రెస్, రిపబ్లికన్ తమిళ్ పార్టీ, సుహేల పార్టీ. పీపుల్స్ పార్టీ, లిబరల్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+