పోలీసులకు లొంగిపోనున్న హనీప్రీత్!? ఆమె లాయర్ సలహా అదేనట..
నెల రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న డేరాబాబా ‘దత్తపుత్రిక’ హనీప్రీత్ సింగ్ ఇక లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: నెల రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న డేరాబాబా 'దత్తపుత్రిక' హనీప్రీత్ సింగ్ ఇక లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పంజాబ్- హర్యానా హైకోర్టులో ఆమె పోలీసులకు గురువారం లొంగిపోనున్నట్టు చెబుతున్నారు.
హనీప్రీత్ సింగ్‌ను కోర్టు ముందు లొంగిపోవాల్సిందిగా తాను సూచించినట్టు ఆమె లాయర్ ప్రదీప్ కుమార్ ఆర్య పేర్కొన్నారు. ఫోన్ ద్వారా ఇప్పటికే ఈ విషయం హనీప్రీత్ కు చెప్పానన్నారు. హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మంగళవారం తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.

పోలీసుల ముందు లొంగిపోవడమే మంచిదంటూ కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలోనే హనీప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అత్యాచారం కేసులో డేరాబాబా గుర్మీత్ సింగ్ దోషిగా తేలిన ఆగస్టు 25న పంచకులలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.
దాదాపు 40 మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అల్లర్లలో హనీప్రీత్ ప్రధాన నిందిరాలిగా ఉంది. హనీప్రీత్‌ను మోస్ట్ వాంటెడ్ నిందితురాలిగా పేర్కొన్న పోలీసులు.. ఆమెను అరెస్టు చేసేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications