కిందపడ్డ చెప్పు, హనీప్రీత్‌దిగా భావించి సెల్ఫీలు తీసుకున్నారు

Posted By:
Subscribe to Oneindia Telugu
Court extends Honeypreet's police remand కిందపడ్డ చెప్పు, హనీప్రీత్‌దిగా భావించి సెల్ఫీలు | Oneindia

చండీగఢ్: సాధ్వీలపై అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఆరు రోజుల పోలీస్ రిమాండులో ఉంది.

పక్కా ప్లాన్‌తో హనీప్రీత్‌లా నటింపచేసి.., పరారిలో 17 సిమ్‌లు ఉపయోగించిన దత్తపుత్రిక

విచారణకు సహకరించడం లేదని

విచారణకు సహకరించడం లేదని

ఆమె విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. రిమాండు పూర్తి కావడంతో పోలీసులు ఆమెను తిరిగి పంచకుల కోర్టుకు తీసుకు వచ్చారు. కోర్టులో హనీప్రీత్ వాదన తర్వాత ఆమెను పోలీసులు బయటకు తీసుకు వచ్చారు.

హనీప్రీత్ బయటకు రాగానే

హనీప్రీత్ బయటకు రాగానే

అప్పుడు మీడియా ఎదురుపడింది. దీంతో ఆమెను పోలీసు వ్యానులోకి త్వరగా ఎక్కించారు. ఈ సమయంలో అక్కడున్న ఓ మహిళ చెప్పు తెగి కింద పడింది. అయితే అక్కడున్న వారు దానిని హనీప్రీత్ చెప్పుగా భావించారు.

చెప్పుతో సెల్ఫీలు

చెప్పుతో సెల్ఫీలు

దీంతో ఆ చెప్పును ఫోటోలు తీసుకున్నారు. అంతేకాదు కొందరు ఆ చెప్పుతో సెల్ఫీలు దిగి మురిసిపోయారట. కోర్టుకు తీసుకు వచ్చిన సమయంలో హనీప్రీత్.. తనకు నడుం నొప్పిగా ఉందని, ఎక్కువసేపు నిలుచోలేకపోతున్నానని పోలీసులను చేతులు జోడించి మరీ వేడుకుంది.

రిమాండ్ పొడిగింపు

రిమాండ్ పొడిగింపు

ఇదిలా ఉండగా హనీప్రీత్ పోలీస్ రిమాండును ఈ నెల 13వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడివడి ఉన్న కారణంగా ఆమెను యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు తీసుకెళ్లాలని పోలీసులు కోర్టుకు తెలిపి రిమాండ్ పొడిగించాలని కోరారు. దీంతో పంచకుల కోర్టు రిమాండు పొడిగించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A court here today extended the police remand of jailed Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh's close associate Honeypreet Insan till October 13.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి