తమిళనాడు ఎన్నికలు: అమ్మకు షాక్ మీద షాక్
చెన్నై: తమిళనాడు శాసన సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత అధికారంలో ఉన్న అన్నా డీఎంకే పార్టీ షాక్ కు గురైయ్యింది. ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ అమ్మను ఇంటికి పంపించి కరుణానిధిని ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో అన్నా డీఎం కార్యకర్తలు ఢీలా పడిపోయారు.
అన్నా డీఎంకేకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపధ్యంలో చెన్నై లోని ముఖ్యమంత్రి జయలలిత నివాసం మూగబోయింది. అటు వైపు కన్నెత్తి చూసే నాథుడే కరువైనాడు. గురువారం ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.
ప్రస్తుతం జయలలిత నివాసం వద్ద నిశ్శబ్ద వాతవరణం నెలకొనింది. అక్కడికి ఎవ్వరు వెళ్లినా, అక్కడి నుంచి బయటకు వచ్చినా నోరు మెదపకుండా సైలెంట్ గా వెళ్లి పోతున్నారు. అందుకు అందుకు కారణం ఎన్నికల సర్వే. కరుణానిధి అధికారంలోకి వస్తారని అందరూ అనుకుంటున్నారు.

జయలలిత
సోమవారం పోలింగ్ సందర్బంగా ఓటు వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన ప్రాణ స్నేహితురాలు శశికళ నాటరాజన్ తో కలిసి నేరుగా ఇంటికి చేరుకున్నారు.

జయలలిత
తరువాత తమిళనాడు మొత్తం ఎన్నికల పోలింగ్ వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆ జిల్లాల నాయకులతో మాట్లాడారు.

జయలలిత
పోలింగ్ ఎలా జరుగుతుంది, మన పార్టీ పరిస్థితి ఏమిటి ? అని ఆరా తీశారు. అయితే అమ్మకు అసలు విషయం చెప్పలేని నాయకులు అంతా బాగుంది అంటూ చెప్పారు.

అన్నా డీఎంకే
అన్నా డీఎంకే బాగా పని చేసిందని, మీరే మళ్లీ అధికారంలోకి వస్తారని అన్నా డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శులు అమ్మకు చెప్పారు.

జయలలిత
అన్ని జిల్లాల నుంచి సమాచారం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.

జయలలిత
మీడియాతో ఎక్కువగా ముచ్చటించని జయలలిత సోమవారం నుంచి నిత్యం అన్ని టీవీ చానెల్స్ చూస్తూ గడుపుతున్నారు.

జయలలిత
సోమవారం నుంచి దినపత్రికలు చదువుతున్నారని, సన్నిహితులతో తప్ప అమ్మ ఎవ్వరితో మాట్లాడటం లేదని అన్నా డీఎంకే పార్టీకి చెందిన ఓ ఎంపీ అంటున్నారు.

కరుణా నిధి, జయలలిత
అన్ని సర్వేలు చూసిన జయలలిత ఒక్క సర్వే తప్పా అన్ని సర్వేలలో అన్నా డీఎంకేకి పరాజయం తప్పదని రావడంతో ఆమె షాక్ కు గురైనారని ఆ ఎంపీ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications