వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాటర్ బాటిళ్లకు ఎమ్మార్పీ వర్తించదు!: సుప్రీం కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాటర్ బాటిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాటర్ బాటిళ్లను గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) కంటే ఎక్కువకు అమ్ముకోవ్చని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

Recommended Video

బంగారం మరియు పెట్రోల్ ధరలు : టుడే ట్రెండింగ్ న్యూస్

వాటర్ బాటిళ్ల(మంచినీళ్ల సీసాలు) అమ్మకాలకు 'న్యాయబద్ధమైన కొలతలు, తూనికల చట్టం' వర్తించదని జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య వేసిన ఓ పిటిషన్ ధర్మాసనం విచారించింది.

Hotels can charge more for bottled water: Supreme Court

హోటళ్లలో వస్తువుల అమ్మకంతోపాటు వినియోగదారులకు సేవలు కూడా అందుతాయని, ఎవ్వరూ కేవలం వాటర్ బాటిళ్లను కొనడానికే హోటళ్లకు వెళ్లరని అభిప్రాయపడింది.

సేవలతోపాటు రెస్టారెంట్లలో ఉండే వాతావరణాన్ని అస్వాదించేందుకే వినియోగదారులు అక్కడకు వెళ్తారనీ, అందుకోసం యాజమానులు పెట్టుబడి పెడుతుండటం వల్ల ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటు వసూలు చేయవచ్చని తెలిపింది.

English summary
The Supreme Court has allowed hotels and restaurants to sell bottled water and other packaged products at above the maximum retail price, saying they also render a service and cannot be governed by the Legal Metrology Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X