వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి విదేశీ మహిళ... అలాంటప్పుడు రాహుల్ ప్రధాని ఎలా అవుతారు: బీఎస్పీ

|
Google Oneindia TeluguNews

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొంతకాలంగా కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉంటూ వస్తున్న మాయావతి పార్టీ బీఎస్పీ కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ అధినేత్రి మాయావతి పేరును తెరపైకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసింది బీఎస్పీ. రాహుల్ గాంధీ తల్లి సోనియాగాంధీ విదేశీయురాలైనందున రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ఎలా అవుతారంటూ ప్రశ్నించింది.

రానున్న లోక్‌సభ ఎన్నికలపై చర్చించేందుకు బీఎస్పీ అధినాయకత్వం భేటీ అయ్యింది. ఈ సందర్భంలోనే దేశప్రధానిగా మాయావతి ఉండాలని ఇప్పటికే సమయం మించిపోయిందని ఆ పార్టీ జాతీయ సమన్వయకర్తలు వీర్ సింగ్, జై ప్రకాష్ సింగ్‌లు వ్యాఖ్యానించారు. అంతేకాదు నరేంద్ర మోడీని ఢీకొట్టగల సత్తా ఒక్క మాయావతికే ఉందని వారన్నారు.

How can Rahul become PM..when his mother is a foreigner,questions BSP

కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి పగ్గాలు చేపట్టడంలో మాయావతి కీలకంగా వ్యవహరించి తన సత్తాను చాటారని చెప్పిన జై ప్రకాష్ సింగ్... నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయాలను ధీటుగా ఎదొర్కొనగల దమ్మున్న నాయకురాలు ఒక్క మాయావతే అని అన్నారు.

మాయావతి ఒక దళిత నేతనే కాదు ఆమెకు వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడా పుష్కలంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరు ప్రచారంలోకి వస్తుండటంతో బీఎస్పీ తనదైన శైలిలో స్పందించింది. రాహుల్ ముఖ పోలికలు సోనియా ముఖపోలికలతో ఉంటాయని రాజీవ్ గాంధీ పోలికలు లేవని బీఎస్పీ వ్యాఖ్యలు చేసింది.

సోనియా విదేశీయురాలు కనుక రాహుల్ దేశప్రధానిగా ఎప్పటికి కాలేరని అది ఆమోదయోగ్యం కాదని బీఎస్పీ కామెంట్ చేసింది. బీఎస్పీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించేందుకు నిరాకరించారు.

English summary
As the run for the 2019 general elections are nearing, politics at the national level are taking an interesting turn.In this connection Mayawati's BSP had made some interesting comments On Rahul Gandhi."How can Rahul become the PM of India when his mother Sonia Gandhi is a foreigner" questioned BSP. The top leaders of that party clarified that its only Mayawati their chief who has all the qualifications to be the next PM of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X