Missed Calls Scam: కేవలం మూడు మిస్డ్ కాల్స్ తో మీ ఖాతా ఖాళీ ? దేశంలో కొత్తరకం స్కాం..
దేశంలో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న ఆన్ లైన్ లావాదేవీలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే మన ఫ్రెండ్స్, కొలీగ్స్, పరిచయస్తుల పేర్లతో సోషల్ మీడియాలో మెసేజ్ లు పంపి దోచుకుంటున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. కానీ అంత కష్టం కూడా లేకుండా ఇప్పుడు మరో కొత్తరకం పద్ధతిలో మన ఖాతాల్ని ఖాళీ చేస్తున్న ఘటనలు బయటపడ్డాయి.
ప్రస్తుతం మనం వాడుతున్న సెల్ ఫోన్ లో యాప్ లన్నీ అందులో వాడుతున్న మొబైల్ నంబర్ కు కనెక్ట్ అయి ఉంటాయి. అంటే సిమ్ కార్డు ద్వారా లింక్ అయి ఉంటాయి. ఈ సిమ్ కార్డును హ్యాక్ చేయగలిగితే ఆయా నంబర్లతో లింక్ అయిన ఖాతాల్లోకి సులువుగా ప్రవేశించి డబ్బులు కాజేసేందుకు వీలుంటుంది. అయితే బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధలు పలు సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇలాంటి చర్యల్ని నిరోధిస్తుంటాయి. కానీ తాజాగా సిమ్ స్వాప్ ఫీచర్ తో సింపుల్ గా మిస్సెడ్ కాల్స్ ఇచ్చి ఖాతాలు ఖాళీ చేస్తున్న ఉదంతాలు బయటపడటంతో బ్యాంకులు కూడా షాకవుతున్నాయి.

ఢిల్లీకి చెందిన ఓ 35 ఏళ్ల మహిళా లాయర్ ఫోన్‌కు తాజాగా మూడు మిస్డ్ కాల్‌లు వచ్చాయి. ఆ తర్వాత ఆమె ఖాతా నుంచి వరుసగా డబ్బులు ఆమెకు సంబంధం లేకుండా డెబిట్ అయి పోయాయి. ఆమె స్పందించి ఫిర్యాదు చేసే లోపే ఖాతా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇదంతా ఎలా జరిగిందని ఆ తర్వాత తెలుసుకుంటే ఆమె వాడుతున్న మొబైల్ ఫోన్ సిమ్ స్వాప్ అయినట్లు తెలిసింది. అంటే మీరు వాడుతున్న నంబర్ సిమ్ కార్డునే స్వాప్ చేసి మరొకటి సృష్టించి డబ్బు కాజేయడం అన్నమాట.
ఇంతకీ ఈ సిమ్ స్వాప్ స్కాం ఎలా జరుగుతోందో తెలుసుకుంటే.. సదరు మహిళకు ఒక నంబర్ నుండి మూడు మిస్డ్ కాల్‌లు వచ్చాయి. కొద్దిసేపటికే తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు డెబిట్ అయినట్లు ఆమెకు మేసెజ్ లు వచ్చాయి. కానీ ఆమె ఎవరికీ ఎటువంటి ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలను వెల్లడించలేదు. అయినప్పటికీ ఆమె డబ్బును పోగొట్టుకుంది. ఈనెల 18న జరిగిన ఈ ఘటనపై న్యాయవాది అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆమె లక్షల రూపాయలు నష్టపోయినట్లు తేలింది. తనకు మొత్తం మూడు కాల్‌లు వచ్చాయని ఆమె నిర్ధారించింది. మరొక నంబర్‌ని ఉపయోగించి తిరిగి కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అది కొరియర్ డెలివరీ కోసం అని ఆమెకు సమాచారం వచ్చింది.

ఇంతకీ ఆమె చేసింది ఏంటంటే.. తన ఇంటి చిరునామాను నిందితుడికి షేర్ చేసింది. అయితే ఆమె ఓ కొరియర్ కోసం తన అడ్రెస్ ఇచ్చింది. దీన్ని తన మొబైల్ నంబర్ కు లింక్ చేసి ఓ ఫేక్ సిమ్ తయారు చేసి దాన్ని ఒరిజినల్ తో స్వాప్ చేయడానికి మిస్డ్ కాల్స్ ఇచ్చినట్లు తేలింది. అలాగే తన ఫోన్ కు అసాధారణ ఫిషింగ్ లింక్స్, ఇతర మెసేజ్ లు వచ్చాయని, అలాగే ఆమెకు తెలియకుండానే బ్రౌజింగ్ హిస్టరీలో పలు అంశాల్ని వీక్షించినట్లు ఉందని తేలింది. ఇదంతా గమనిస్తే ఆమె సిమ్ స్వాప్ చేయడం ద్వారా ఆమె ఫోన్ లోకి వెళ్లి అప్పటికే పంపిన లింక్స్ ను క్లిక్ చేసి ఈ డబ్బులు కొట్టేసినట్లు తెలిసింది.
అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ స్కామ్‌లో సిమ్ స్వాప్ స్కామర్‌ల ప్రాథమిక లక్ష్యం వ్యక్తిగత డేటాను పొందడం. వారు డూప్లికేట్ సిమ్ పొందేందుకు మొబైల్ నెట్‌వర్క్‌లోని ఎవరి సాయం అయినా తీసుకోవచ్చు. ప్లాట్‌ఫారమ్‌తో సంబంధం లేకుండా మీ చిరునామా లేదా ఆధార్ కార్డ్ , పాన్ వివరాల వంటి వ్యక్తిగత డాక్యుమెంటేషన్‌తో సహా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ పోస్ట్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిని ధృవీకరించుకోకుండా మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వొదని చెబుతున్నారు. అలాగే మీ సిమ్ కార్డ్ పని చేయకపోతే, ముఖ్యంగా అది యాదృచ్ఛికంగా జరిగితే వెంటనే టెలికాం ఆపరేటర్‌కు తెలియజేయాలి.వాస్తవానికి, అధికారులు లేదా బ్యాంకింగ్ ఏజెంట్లుగా నటిస్తూ కాల్ చేసే వ్యక్తులకు ఓటీపీలు షేర్ చేయకూడదని చెబుతున్నారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications