మోదీ ముఖం చూసి ఎన్నిసార్లు ఓటు వేస్తారు ?, మీకు సిగ్గులేదా ?, ఖార్గే !
బెంగళూరు/హెబ్బళి: ప్రధాని నరేంద్ర మోదీ ముఖం చూసి ఓటు వెయ్యాలని బీజేపీ నాయకులు సిగ్గులేకుండా అడుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మండిపడ్డారు. లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో, చివరికి పంచాయితీ ఎన్నికల్లో కూడా మోదీ ముఖం చూసి ఓటు వెయ్యాలని బీజేపీ నాయకులు ఓటర్లను దీనంగా అడుకుంటున్నారని మల్లికార్జున ఖార్గే మండిపడ్డారు.
కర్ణాటకలోని హుబ్బళిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తరువాత మీడియాతో మాట్లాడారు. పదేపదే మోదీ ముఖం చూసి ఓటు వెయ్యాలని బీజేపీ నాయకులు ఓటర్లను ప్రాదేయపడుతున్నారని మల్లికార్జున ఖార్గే ఎద్దేవ చేశారు. ఎన్నిసార్లు మోదీ ముఖం చూసి ఓటు వేస్తారు అని బీజేపీ నాయకులను మల్లికార్జున ఖార్గే ప్రశ్నించారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తాను ఇన్ని మంచి పనులు చేశాను, ఇన్ని లక్షల మంది పేదలను ఆదుకున్నాను అని ఎన్నికల ప్రచారం చేసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ ముఖం, కేంద్ర మంత్రి అమిత్ షా ముఖం చూసి ఓట్లు వెయ్యాలని కన్నడిగుల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మల్లికార్జున ఖార్గే మండిపడ్డారు.
బీజేపీ నాయకులు వారు చేసిన మంచి పనులు, వారి నియోజక వర్గాలకు చేసిన సేవ ఏమిటి అని ప్రజలకు వివరించి ఓట్లు అడిగితే బాగుంటుందని. అలా కాకుండా ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మోదీ ముఖం చూసి బీజేపీకి ఓట్లు వెయ్యండి అంటూ అడుక్కుంటున్నారని మల్లికార్జున ఖార్గే ఎద్దేవ చేశారు.

ఇప్పుడు జరుగుతున్నది లోక్ సభ ఎన్నికలు కాదు, మోదీ ముఖం చూసి ఓట్లు వెయ్యడానికి, అసెంబ్లీ ఎన్నికలు, కర్ణాటకలోని బీజేపీ నాయకుల ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా ? అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కర్ణాటకలోని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. బీజేపీ నాయకుల తీరు చూస్తుంటే ప్రధాని మోదీ పంచాయితీ ఎన్నికలను కూడా వదలరని మల్లికార్జున ఖార్గే వ్యంగంగా అన్నారు.
కర్ణాటకలోని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని, ఈ విషయం జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ముఖాలను అడ్డం పెట్టుకుని లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వీరి ఎత్తుగడలు సాగవని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే జోస్యం చెప్పారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications