Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Modi: భారత్ మరో బంగ్లాదేశ్ కాకుండా కాపాడిన మోడీ నిర్ణయాలివే..! లేకుంటే హసీనా స్ధానంలో..

పొరుగుదేశం బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల మార్పులతో తలెత్తిన అల్లర్లు సంక్షోభంగా మారి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఉసురుతీశాయి. రిజర్వేషన్లపై ఘర్షణలు మొదలుకాగానే వెంటనే స్పందించి అణచేయాల్సిన తరుణంలో హసీనా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమే ఇవాళ బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న దుస్థితికి కారణం. ఈ నేపథ్యంలో భారత్ లోనూ గతంలో ఇలాంటి నిరసనలు తలెత్తినప్పుడు ప్రధాని మోడీ ఎదుర్కొన్న తీరుపై చర్చ జరుగుతోంది. అప్పట్లో మోడీ అలాంటి గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే కచ్చితంగా భారత్ కూడా మరో బంగ్లాదేశ్ గా మారి ఉండేదని తెలుస్తోంది.

భారత్ లో గత పదేళ్లలో కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు ఇతరత్రా కారణాలతో నిరసనలు జరిగాయి. వీటిపై మోడీ సర్కార్ కఠినంగా వ్యవహరించింది. ఎప్పటికప్పుడు ఇంటెల్ రిపోర్టులు తెప్పించుకోవడంతో పాటు వాటిని అణచివేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ను రంగంలోకి దింపిన సందర్భాలున్నాయి. దీంతో అవి తాత్కాలికంగా చెలరేగినా ఆ తర్వాత క్రమంగా సద్దుమణిగాయి. ఇలాంటి వాటిలో నోట్ల రద్దు, బాబ్రీ మసీదుపై సుప్రీంతీర్పు, సీఏఏ నిరసనలు, ఆర్టికల్ 370 రద్దు వంటివి ఇలా చాలానే ఉన్నాయి.

how pm modi saves india from becoming the next Bangladesh with bold decisions

పెద్ద నోట్ల రద్దు:

2016 నవంబర్ లో కేంద్రం అనూహ్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా 500, 1000 నోట్లు రాత్రికి రాత్రే రద్దయ్యాయి. దీంతో జనం కరెన్సీ కోసం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ క్యూ కట్టారు. ఈ క్రమంలో చాలా మంది మృత్యువాత కూడా పడ్డారు. ఈ నేపథ్యంలో జనాగ్రహం పెల్లుబుకింది. నల్లధనంపై చర్యల పేరుతో సామాన్యుల్ని ఇబ్బందిపెడతారా అంటూ పలు చోట్ల నిరసనలు చెలరేగాయి. వీటిని కేంద్రం సమర్ధంగా అడ్డుకుంది.

how pm modi saves india from becoming the next Bangladesh with bold decisions

ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు:

2019 ఎన్నికలకు ముందు కేంద్రంలో మోడీ సర్కార్ ఆర్ధికంగా బలహీన వర్గాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కోటాను కదిలించకుండానే మరో 10 శాతం కోటా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై అప్పటికే రిజర్వేషన్ కలిగిన వర్గాలతో పాటు లేని వర్గాలు కూడా మండిపడ్డాయి. పలు రాష్ట్రాల్లో నిరసనలు కూడా జరిగాయి. వీటిపై కేంద్రం ఆయా వర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

how pm modi saves india from becoming the next Bangladesh with bold decisions

ఆర్టికల్ 370 రద్దు:

జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం 2019లో రద్దు చేసింది. దీంతో కాశ్మీర్ భగ్గు మంది. స్వాతంత్రం తర్వాత స్థానిక మహారాజు రాజా హరిసింగ్ తో చేసుకున్న ఒప్పందం మేరకు అమల్లోకి వచ్చిన ఆర్టికల్ 370ని తీవ్రవాద అణచివేత పేరుతో కేంద్రం రద్దు చేయడంతో అక్కడి ప్రజలు, రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. అయితే రాజకీయ నేతల్ని హౌస్ అరెస్టులు చేయడంతో పాటు సాధారణ ప్రజలపైనా ఇంటర్నెట్ నిలిపివేత వంటి ఆంక్షలతో కేంద్రం వివాదం ముదరకుండా చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది.

how pm modi saves india from becoming the next Bangladesh with bold decisions

బాబ్రీ మసీదుపై సుప్రీంతీర్పు :

అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఆ స్థలం యాజమాన్య హక్కుల విషయంలో సుదీర్ఘంగా సాగిన విచారణ తర్వాత 2019 నవంబర్ లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అయోధ్య స్థలం హిందువులదే అని తేల్చేసింది. దీంతో పాటు ముస్లింలకు అయోధ్యలోనే మరో స్థలం కేటాయించాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపైనా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగే అవకాశం ఉండటంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. దీంతో ఈ వివాదం కూడా త్వరగానే సద్దుమణిగింది.

how pm modi saves india from becoming the next Bangladesh with bold decisions

సీఏఏ నిరసనలు:

కేంద్రం దేశంలోకి పొరుగుదేశాల నుంచి ముస్లింల చొరబాట్లను అడ్డుకునేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం ఇప్పటికే దేశంలో ఉన్న పౌరులందరి రికార్డులను పరిశీలించి వారికి కొత్తగా పౌరసత్వం కేటాయిస్తారు. ఇందులో డాక్యుమెంట్లు లేకపోతే మాత్రం వారిని దేశం నుంచి తరిమేస్తారన్న ప్రచారం జరగడంతో సీఏఏ అమలుపై పలు రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి. ఇవి ముదురుతున్న తరుణంలో కేంద్రం సీఏఏ అమలును వాయిదా వేసి వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసింది.

how pm modi saves india from becoming the next Bangladesh with bold decisions

ఢిల్లీలో రైతుల ఆందోళన :

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీలో నిరసనలకు తరలివచ్చారు. వీరిని ఢిల్లీలో అనుమతించకపోవడంతో సరిహద్దుల్లోనే ఉండి నిరసనలు కొనసాగించారు. మధ్యలో రిపబ్లిక్ డే రోజు నగరంలోకి ప్రవేశించి ఎర్ర కోటనే ముట్టడించారు. ఈ ఆందోళనల్ని కూడా కేంద్రం తగిన సమయంలో స్పందించి అడ్డుకట్ట వేసింది. ఆ తర్వాత నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకుంది. దీంతో రైతుల నిరసనలు తగ్గిపోయాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+