వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టరీ స్టోరీ: దుబాయ్ యువరాణిని అప్పగించినందుకే క్రిస్టియన్ మైఖేల్‌ను అప్పగించారా..?

|
Google Oneindia TeluguNews

అగస్టావెస్ట్‌లాండ్ కుంభకోణం కేసులో మధ్యవర్తిగా ఉంటూ ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త క్రిస్టియన్ మైఖేల్‌ను సీబీఐ అధికారులు దుబాయ్‌ నుంచి భారత్‌కు రప్పించిన సంగతి తెలిసిందే. అయితే మైఖేల్‌ను దుబాయ్ ప్రభుత్వం అంత సులభంగా ఎలా అప్పగించింది అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు క్రిస్టియన్ మైఖేల్‌ను భారత్‌కు రప్పించడం వెనక జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ మాస్టర్ మైండ్ ఉందనేది కూడా తెలుస్తోంది. మరోవైపు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రం ఈ కథను మరో కోణంలో చూస్తోంది.

 గోవాలో భారత కమాండోలకు చిక్కిన దుబాయ్ యువరాణి లతీఫా

గోవాలో భారత కమాండోలకు చిక్కిన దుబాయ్ యువరాణి లతీఫా

దుబాయ్ రాజు ఆదేశ ప్రధాని షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ -మఖూమ్ కూతురు యువరాణి లతీఫా ఈ ఏడాది ప్రారంభంలో పారిపోయిన సంగతి తెలిసిందే. దేశం విడిచి పారిపోయేందుకు ఆమె దాదాపు ఏడేళ్లుగా ప్రయత్నిచింది. సమయం చూసుకుని పక్క ప్రణాళికతో ఆమె ఫ్రెంచ్ అమెరికా సంతతికి చెందిన హర్వ్ జాబర్ట్ పడవలో భారత్‌లోని గోవా వైపునకు బయలుదేరింది. గోవా తీరానికి 30 మైళ్ల దూరంలో ఆమె ప్రయాణిస్తున్న పడవను గమనించిన కోస్ట్ గార్డ్ అధికారులు ఆమెను పట్టుకుని తిరిగి దుబాయ్‌కు పంపారు. ఇక అప్పటి నుంచి లతీఫా గురించి కానీ లేదా ఆమె మాట కానీ బయట వినపడలేదు. అయితే అంతకు ముందే ఆమె ఓ వీడియోను రికార్డు చేశారు. "ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే తాను మృతి చెందానని అయినా భావించండి లేదా తను చాలా గడ్డుపరిస్థితుల్లో ఉన్నట్లయినా భావించండి"అంటూ అందులో రికార్డు చేసింది.

 లతీఫా కనిపించకుండా పోవడంపై భారత్ దుబాయ్‌లు బాధ్యత వహించాలి

లతీఫా కనిపించకుండా పోవడంపై భారత్ దుబాయ్‌లు బాధ్యత వహించాలి

యువరాణి లతీఫా బంధీ అయ్యిందని ఆమె విడుదలకు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాల్సిందిగా ఆమె తరపున లాయర్లు యూఎన్ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు ఆమె కనిపించకుండా పోయినందుకు దుబాయ్ భారత్‌లు బాధ్యత వహించాలని కోరారు. ఇదిలా ఉంటే లతీఫాను పట్టుకున్న భారత కమాండోలు ఆమెను ఈడ్చుకెళ్లినట్లు ఆమ్నెస్టీ అనే పత్రిక రాసుకొచ్చింది. ఆ సమయంలో భారత కమాండోలు తుపాకులతో బెదిరించినట్లు పేర్కొన్న పత్రిక తాను రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు బిగ్గరగా కేకలు వేసినట్లు ఆమ్నెస్టీ పత్రిక పేర్కొంది.

వారంలోనే అన్ని లాంఛనాలు పూర్తి

వారంలోనే అన్ని లాంఛనాలు పూర్తి

యువరాణి లతీఫాను పట్టుకుని దుబాయ్‌కు పంపడంతోనే క్రిస్టియన్ మైఖేల్ విషయంలో కూడా దుబాయ్ ఆశావాహక దృక్పథంతో వ్యవహరించి ఉంటుందనే అనుమానాలు ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 19 నెలల క్రితమే మైఖేల్‌ను భారత్‌కు అప్పగించాల్సిందిగా మన ప్రభుత్వం దుబాయ్ ప్రభుత్వాన్ని కోరింది. ఇక అన్ని రోజులుగా లేనిది గత వారం రోజుల్లోనే అన్ని లాంఛనాలను పూర్తి చేసి క్రిస్టియన్‌ను భారత్‌కు అప్పగించింది అంటే దానివెనక కారణం భారత్ దుబాయ్‌కు చేసిన సహాయమే అని భావిస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు.

నాడు మైఖేల్‌ను అప్పగించేందుకు నో చెప్పిన దుబాయ్ ప్రభుత్వం

నాడు మైఖేల్‌ను అప్పగించేందుకు నో చెప్పిన దుబాయ్ ప్రభుత్వం

క్రిస్టియన్ మైఖేల్ బ్రిటీషు జాతీయుడని అతన్ని భారత్‌కు అప్పగించడాన్ని తప్పుబట్టింది నాడు దుబాయ్ ప్రభుత్వం. అయితే దుబాయ్ యువరాణి లతీఫాను భారత్ సురక్షితంగా దుబాయ్‌కు అప్పగించాక ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధాలు బలపడ్డాయి. ఈ రెండు దేశాలు సత్సంబంధాలు మెరుగుపడటంలో ప్రధాని మోడీ, దుబాయ్ దేశ రాజు మొహ్మద్ బిన్ జాయెద్‌లు కీలకంగా వ్యవహరించారు. ఏది ఏమైనప్పటికీ అగస్టావెస్ట్‌లాండ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న క్రిస్టియన్ మైఖేల్‌ను మాత్రం భారత్‌కు రప్పించడాన్ని ఓ ఘనవిజయంగా భావిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. బోఫోర్స్ కేసు తర్వాత ఇలాంటి ఘరానా మోసం కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకుతిరుగుతున్న ఆర్థిక నేరగాళ్లను పట్టుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.


రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌లాండ్ డీల్‌లో భాగంగా భారత రాజకీయనాయకులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ఇతర రక్షణశాఖ అధికారులను మేనేజ్ చేసేందుకు గాను మధ్యవర్తిగా ఉన్న క్రిస్టియన్ మైఖేల్‌కు అగస్టా‌వెస్ట్‌లాండ్ కంపెనీ 295 కోట్లు లంచంగా ఇచ్చింది. ఇంకా ఈ కేసులో నిందితులుగా గిడో హాష్కే, కార్లో జెరోసాలను పేర్కొంది ఈడీ, సీబీఐ.

English summary
Christian Michel who was extradited from Dubai to India is now in the CBI custody.His extradition from the UAE follows an adverse order of a Dubai court. But Intelligence sources claimed "the development could also be seen as linked as linked to India's assistance in tracking Dubai's run away princess Latifa."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X